లాజిక్ మిస్సయిన వైకాపా... పరువు పోగొట్టుకుందా?

August 07, 2020

ఏపీలోని 175 సీట్లలో తెలుగుదేశం పార్టీకి వచ్చి 23 సీట్లు. అందులో 3 వైకాపా లాగేసుకుంది. మిగిలినవి 20. విచిత్రం ఏంటంటే... చంద్రబాబు మాయలో పడి వైకాపా లాజిక్స్ ను మరిచిపోతోంది. దీంతో ఎదురుదెబ్బలు తింటూ జనంలో పరువుపోగొట్టుకుంటోంది. తనకు చేతకాని వాటిని చంద్రబాబు అడ్డుపడ్డాడు అని ఆయన్ను బూచిగా చూపిస్తుంది. తను చేసిన వాటిని మాత్రం... మేమే చేశాం అని చెప్పుకుంటోంది.

ఇళ్ల స్థలాల పంపిణీ కోసం భూసేకరణ చేసేటపుడు వివాదాస్పద భూములను కొనుగోలు చేశారు. దీంతో  కోర్టు కేసులయ్యాయి. తెలుగుదేశం పార్టీ వాదన ఏంటంటే... మీ మానాన మీరు వివాదాస్పద భూములు పేదలకు అంటగడితే రేపు వాళ్ల డబ్బులతో ఇల్లు కట్టుకుంటే ప్రజలు నష్టపోతారు. భూమి వివాదాల్లో పడితే ఇంటి నిర్మాణం కోసం పేదలు పెట్టిన డబ్బులు అన్యాయం అయిపోతాయి. అందుకని వివాదాలులేని భూములు పేదలకు పంచండి అంటోంది. ఈ కార్యక్రమాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయం చేయడానికి ప్రయత్నిస్తున్న వైకాపా చిత్తశుద్ధితో క్లీన్ టైటిల్ ఉన్న భూములును కాకుండా కొన్నిచోట్ల వివాదాస్పద భూముల జోలికి పోయింది. పేదవాడు లీగల్ సమస్యల్లో చిక్కుకోకుండా ఉండటానికి తాము పోరాడుతామంటోంది టీడీపీ.

తమ చేతకాని తనాన్ని వైసీపీ నాయకులు చంద్రబాబు మీద వేస్తున్నారు. ‘‘పేదలకు ఇళ్ళ పట్టాలు ఇవ్వద్దు అంటూ తెలుగుదేశం పార్టీ అడ్డుపడుతుంది’’ అని వైసిపి మంత్రి బొత్స ఆరోపణలు చేశారు. మరి 203 రోజులుగా రాజధాని అమరావతి తరలించవద్దంటూ తెలుగుదేశం అడ్డుపడుతుంది. మరి అది ఆపుతున్నారా? లేదు. రంగులు వేయొద్దని చంద్రబాబు అడ్డుపడ్డారు... కానీ కోర్టులనే దిక్కరించి రంగులు వేశారు. అరాచకంగా ఎన్నికలు నిర్వహించవద్దు అందరికీ నామినేషన్ వేసుకునే హక్కు ఇవ్వండని టీడీపీ పోరాడితే విన్నారా లేదు. మీరనుకున్నట్లు చేశారు. మరి ఇన్నిటికి అడ్డం కాని చంద్రబాబు ఇళ్ల స్థలాలకు ఎలా అడ్డం అయ్యారని టీడీపీ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. తెలుగు మీడియం రద్దు చేయొద్దని చెబుతుంటే విన్నారా? లేదు. అలాగే చంద్రబాబు అడ్డుపడినా ఎందుకు భూములు పంచలేకపోయారు? ఎందుకంటే ఆ భూముల్లో లొసుగులు ఉన్నాయి కాబట్టి... తమకు లాభం వచ్చేవి, ఇష్టమైనవి వేగంగా చేసే వైకాపా... ప్రజలకు లాభం చేకూర్చేవి చేయడంలో మాత్రం వాయిదాలు వేసుకుంటూ పోతుంది.

ఇన్ని సార్లు వాయిదా వేయడంతో జనంలో తీవ్ర విమర్శలు రావడంతో చంద్రబాబును బూచిగా చూపి తప్పించుకోవడానికి వైకాపా శతథా ప్రయత్నం చేస్తోంది. దీంతో అది బ్యాక్ ఫైర్ అవడంతో ఎట్టి పరిస్థితుల్లో స్వతంత్ర దినోత్సవం నాడు స్థలాలు  పంచుతాం అని ప్రభుత్వం ప్రకటించింది.