ప్రజల డబ్బుతో జగన్ తీర్థయాత్ర

July 04, 2020

ఎన్నికలు వచ్చినపుడు ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి
దేవుడు గుర్తొచ్చినపుడు ఆయన ‘‘జగన్’’ మాత్రమే.

రాజకీయం కోసం ఏ అంశాన్ని అయినా వాడుకోగలిగిన సమర్థత జగన్ ది. చంద్రబాబు రాష్ట్ర భవిష్యత్తు కోసం పెట్టుబడులు తేవడానికి రాష్ట్ర ఖర్చులతో దేశాలు తిరిగితే చంద్రబాబును దుబారా అని విమర్శించిన జగన్ రెడ్డి ఇపుడు ఏం చేస్తున్నారో తెలుసా?

రాష్ట్ర ప్రజల డబ్బుతో జెరూసలెం పర్యటనకు వెళ్లారు. కుటుంబసమేతంగా, పూర్తి వ్యక్తిగతంగా చేసుకుంటున్న ఈ ఆధ్యాత్మిక పర్యటనకు ఆయన రాష్ట్ర ఖజానాకు బొక్క పెడుతున్నారు. ప్రతి ఏడాది ఆయన కుటుంబం జెరూసలెం వెళ్తుంది. ఈసారి కూడా ఆయన టూరు వెళ్తున్నాడు. సీఎం కాక ముందు సొంత డబ్బులు పెట్టుకునేవారు. సీఎం అయ్యాక ప్రభుత్వ నిధులు దీనికోసం 22 లక్షలు విడుదల చేశారు. ఇది అధికారిక జీవో.

లేదండీ... జగన్ సొంత ఖర్చులతో వెళ్తున్నారు అని మీరు ఖండించొచ్చు. గవర్నమెంటు కూడా ఆ మేరకు ప్రకటించొచ్చు. కానీ... జెరూసలెంలో ఏ నక్సలైట్ల దాడి ఉంటుంది? ఏ ఉగ్రవాదులు జగన్ పై దాడి చేస్తారు? ఆ కంట్రీలో జగన్ ఎలా టార్గెట్ అవుతారు? ఏంటో అంతా మాయ కాకపోతే... కొంపదీసి ప్రయాణ ఖర్చులు సెక్యూరిటీ పేరుతో విడుదల చేశారా అని ప్రజలకు గట్టి అనుమానాలున్నాయి. మరి ఇంత టెక్నికల్ గా గవర్నమెంటు సమాధానం ఇచ్చాక ఇక నవ్వుకోవడం తప్ప చేసేదేముంది!!