పంజా దెబ్బ‌: జ‌గ‌న్ ను క‌ట్ట‌డి చేసిన‌ బాబు

June 01, 2020

ఆంధ్రుల‌ను తెలుగులో ఎన్ని బూతులు ఉంటే అన్ని బూతుల‌తో తిట్టిన కేసీఆర్‌తో నిస్సిగ్గుగా అంట‌కాగి ఆంధ్రుల‌ను తెలంగాణ‌కు అమ్మేయడానికి సిద్ధ‌మైన వైఎస్ జ‌గ‌న్  ను చంద్ర‌బాబు త‌న మాట‌ల‌తో క‌ట్ట‌డి చేశాడు. అమ‌రావ‌తి లో రాజ‌ధాని మార్చ‌ను అని న‌మ్మించడానికి క‌ట్టిన ఒక్క సెట్టింగ్ లాంటి బిల్డింగ్ ను నామ్‌కే వాస్తే ఓపెన్ చేసి ఆంధ్ర రాజ‌కీయాన్ని కేసీఆర్ ప్లానింగ్‌తో తెలంగాణ నుంచి న‌డుపుతున్న  జ‌గ‌న్‌పై చంద్ర‌బాబు నిప్పులు చెరిగారు. ఆంధ్రా రాజ‌కీయం కేరాఫ్ తెలంగాణ‌... ద‌టీజ్ జ‌గ‌న్ అంటూ టీడీపీ చేసిన దాడికి జ‌గ‌న్ భ‌య‌ప‌డ్డాడు. 

అభ్య‌ర్థుల ఎంపిక ప్ర‌క్రియ‌ను హైద‌రాబాదులోని లోట‌స్ పాండ్ నుంచి విడుద‌ల చేయ‌డానికి జ‌గ‌న్ భ‌య‌ప‌డ్డాడు. అందుకే ఈరోజు ప్ర‌క‌ట‌న చేయాల్సిన తొలి జాబితాను వాయిదావేశాడు. అయినా అమ‌రావ‌తిని రాజ‌ధానిగా ఏ మాత్రం ఇష్ట‌ప‌డ‌ని జ‌గ‌న్ అభ్య‌ర్థుల ప్ర‌క‌ట‌న‌ను క‌డ‌ప‌లోని ఇడుపుల‌పాయ నుంచి చేస్తార‌ట‌. అంటే అయితే, కేసీఆర్ రాజ్యం లేదంటే... క‌డ‌ప గూండా రాజ్యం అన్న‌ట్టు ఉంది జ‌గ‌న్ క‌థ‌. ఏనాడూ ప‌రిపాల‌న గురించి, భ‌విష్య‌త్తు ప్ర‌ణాళిక గురించి జ‌గ‌న్ చెప్ప‌డు. చంద్ర‌బాబు పెట్టిన కొత్త ప‌థ‌కాల‌ను కూడా వైఎస్ అక్కౌంట్లో వేయ‌డానికి సాహిసించాడు జ‌గ‌న్‌. ఇదంతా ప‌క్క‌న పెడితే... ఇక బాబును ఓడించ‌డం త‌న చేత‌కాదు అని ఫిక్స‌య్యి... అన్ని విడిచి కేసీఆర్‌తో, మోడీతో చేతులు క‌లిపాడు. దీనికి కూడా లిఖిత పూర్వ‌క సాక్ష్యాన్ని బ‌య‌ట‌పెట్టింది తెలుగుదేశం పార్టీ. ఏది ఏమైనా ఆంధ్రుల‌ను తెలంగాణ దొర‌కు అమ్మేసే జ‌గ‌న్ కుట్ర‌ను ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ప‌క‌డ్బంధీగా అడ్డుకున్నారు.