ఫ్రస్టేషన్ మొత్తం చూపిన జగన్ రెడ్డి

May 25, 2020

జగన్ లో ఒక ముఖ్యమంత్రికి ఉన్న సహనం, నెమ్మదితనం, విజ్జత పూర్తిగా లోపించినట్టు మాట్లాడుతున్నారు. విషయం చెప్పడం వేరు, ఫ్రస్ట్రేషన్ వెలిబుచ్చడం వేరు. బిల్లులు కొంతకాలం ఆపడం తప్ప పూర్తిగా ఆపేయలేని మండలి ఉండటం వల్ల నిరుపయోగం అనేది ముఖ్యమంత్రి అభిప్రాయం. కానీ... ఆ విషయాన్ని కూడా అక్కసుతో వ్యక్తిగత కక్షతో చెబుతున్నారు జగన్ రెడ్డి.

ఆయన గౌరవ ప్రదమైన ఒక వ్యవస్థ గురించి అసెంబ్లీలో ఎంత ఫ్రస్టేషన్ తో మాట్లాడారంటే...

‘‘ప్రజలతో ఎన్నుకున్న శాసనసభ రూపొందించిన బిల్లులను తాత్కాలికంగా అడ్డుకోవడానికి ఉపయోగపడుతున్న ఇలాంటి మండలిని ఏమనాలి? ప్రజాప్రయోజనం లేని మండలి ఇది. దీనిపై డబ్బు ఖర్చు చేయడం శుద్ధ దండగ. రాష్ట్ర ఖజానా నుంచి దీనికి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయడం అనవసరం. మండలికి దాదాపుగా రూ.60 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. ఈ మండలికి ఇంతింత సొమ్ము ఖర్చు  చేయడం ధర్మమేనా? అని ఆలోచించాల్సిన అవసరం ఉంది" అని జగన్ వ్యాఖ్యానించారు.

మండలి ప్రభావితమైనది కాకపోవచ్చు. నిరుపయోగం కావచ్చు. కానీ ఆ విషయం చెప్పడంలో ముఖ్యమంత్రికి ఇంత అక్కసు కోపం ఎందుకు? ప్రస్తుత పరిస్థితుల్లో మండలి అనవసరం అని భావిస్తూ రద్దు చేస్తున్నాం అని చెబితే సరిపోతుంది. ఆ మాత్రం దానికి అదేదో లోకేష్ పదవి పోగొట్టాలి, నాకు నచ్చని పని చేసిన వారి అంతు తేల్చాలి అన్న కోణంలో మాత్రమే ముఖ్యమంత్రి మాట్లాడుతున్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది.