జగన్ ‘ఖ్యాతి’... ఖండాంతరాలకు వ్యాపించింది

May 28, 2020

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి... ఈ పేరు వింటే వైసీపీ అధినేతో, లేదంటే... ఏపీకి కొత్తగా ముఖ్యమంత్రి అనో, మరీ లేదంటే... తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని లక్ష కోట్లు దండుకున్న అవినీతి తిమింగమనో చెబితేనే సరిపోదు ఇప్పుడు... ఎందుకంటే... ఆయన ఇప్పుడు అవినీతిలో ఇంటర్నేషనల్ రేంజికి ఎదిగిపోయారు మరి. తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉండగా... జగన్ సాగించిన అవినీతిని చూసి దేశం యావత్తు కళ్లు తేలేసిందనే చెప్పాలి. అయితే ఆయన సాగించిన అవినీతి దందాను చూసి ప్రపంచ దేశాలు కూడా విస్తుపోతున్నాయన్న కొత్త మాట ఇప్పుడు ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇదేదో... జగన్ అంటే గిట్టని వైరి వర్గం చేస్తున్న ఆరోపణ ఎంతమాత్రం కాదు. అవినీతికి పాల్పడితే... ఉరి శిక్షేనంటూ కఠిన చట్టాలు అమలు చేస్తున్న అరబ్ దేశాలు చెబుతున్న మాట.

నిజమా? జగన్ మరీ అంతగా తెగించేశారా? అంటే... నిన్నటి అరబ్ దేశాల నుంచి వెలువడే ‘గల్ఫ్ న్యూస్’ పత్రిక సంచికను చూస్తే జగన్ అంతకకు మించి తెగించేశారన్న మాట కూడా చాలదేమోనని అనక మానరు. అక్షర సత్యంగా కనిపిస్తున్న ఈ కథనంలో జగన్, ఆయన అనుయాయులు సాగించిన అవినీతి దందాను సవివరంగా సదరు పత్రిక ప్రచురించేసింది. అంతేకాకుండా బీజేపీ నేతల చెట్టూ జగన్ ప్రదక్షిణలు చేస్తున్న కారణాన్ని కూడా ఆ పత్రిక విస్పష్టంగానే చెప్పేసిందన్న మాట కూడా ఆసక్తి రేకెత్తిస్తోంది. ఈ కథనం ఏపీతో పాటు తెలంగాణనే కాకుండా యావత్తు భారత దేశాన్ని నివ్వెరపరచిందన్న మాటలు కూడా ఇప్పుడు అత్యంత ఆసక్తికరంగా మారిపోయాయన్న మాట కూడా వినిపిస్తోంది.

అయినా ‘గల్ఫ్ న్యూస్’ బ్యానర్ కట్టి మరీ ప్రచురించిన ఈ కథనంలో ఏముందన్న విషయానికి వస్తే... భారత్ కు చెందిన పలువురు పారిశ్రామికవేత్తలు అరబ్ దేశాలకు చెందిన బ్యాంకుల నుంచి పెద్ద ఎత్తున రుణాలు తీసుకున్నారట. ఆ తర్వాత సదరు రుణాలను తీర్చే బాధ్యతలను మాత్రం మనోళ్లు మరిచారట. అయితే మన బ్యాంకుల్లో అరబ్ కంట్రీల బ్యాంకులు రుణాలు ఎగవేసే వారిని ఊరకే వదిలేయవు కదా. తమ దేశం కాని వారైనా సరే... తమ ప్రభుత్వం సహాయంతో తిన్నదంతా కక్కించేదాకా ఊరుకోవట. ఈ క్రమంలోనే వాన్ పిక్ పేరిట ప్రముఖ పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ ను బూచిగా చూపి అరబ్ దేశాలకు చెందిన రస్ ఆల్ ఖైమాను ఏపీకి రప్పించి, ఆ కంపెనీతో భారీగా పెట్టుబడలు పెట్టించడంలో జగన్ సక్సెస్ అయ్యారు. అయితే వైఎస్ అకాల మరణం తర్వాత జగన్ బండారం బయటకు రాగా... అదే ఆరోపణలతో వాన్ పిక్ ను కూడా ఆ తర్వాతి ప్రభుత్వాలు రద్దు చేసేశాయి. సరే.. జగన్ తనకు ఆర్థిక వ్యవహారాల్లో భాగస్వామి కాబట్టి నిమ్మగడ్డ ఊరకే ఉండొచ్చు గానీ... అరబ్ దేశాల బ్యాంకులు ఎందుకు ఊరకుంటాయి?

 

ఇక్కడా అదే జరిగింది. రస్ ఆల్ ఖైమా నుంచి పెట్టుబడులు పెట్టించిన నిమ్మగడ్డ... సెర్చియా రాగానే రంగంలోకి దిగిన అరబ్ కంట్రీస్ ఆయనను అరెస్ట్ చేయించేశాయి. అంతేకాకుండా నెలల తరబడి నిమ్మగడ్డను తమ అదుపులోనే ఉంచుకుని మొత్తం సమాచారాన్ని రాబట్టాయట. ఈ విచారణలో భాగంగా నిమ్మగడ్డ ద్వారా రస్ ఆల్ ఖైమా పెట్టిన పెట్టుబడులు అటు నిమ్మగడ్డ వద్ద కాకుండా, ఇటు ఏపీ ప్రభుత్వం వద్ద కాకుండా నేరుగా జగన్ కు చేరిపోయనట్లుగా సదరు బ్యాంకులు తెలుసుకుని షాక్ తిన్నాయట. అయినా సరే... జగన్ ఎవరైతే తమకేంటన్న భావనతో జగన్ వద్ద నుంచి తమ డబ్బులు ఇప్పించాలని ఏకంగా భారత ప్రభుత్వానికి లేఖలు రాయించేశాయట. ఈ విషయం ఎలా తెసుకున్నారో గానీ.. జగన్ తనను తాను కాపాడుకునేందుకు ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారట. మరి ఇంత కథ ఉంటే... జగన్ ‘ఖ్యాతి’ ఖండాంతరాలకు చేరిపోయినట్టే కదా.