వైఎస్ సునీత మరో సంచలనం... హైకోర్టులో వైసీపీ నేతల పేర్లు చెప్పిందా?

February 17, 2020

చంద్రబాబు అధికారంలో ఉన్నపుడు, ఎన్నికల ముందు జరిగిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును చంద్రబాబు సీబీఐ కి ఇవ్వడం లేదని ఆరోజు ఆరోపించిన సునీత... తమ అన్నయ్య అధికారం చేపడితే వెంటనే ఆ పనిచేస్తాడని ఆమె భ్రమ పడింది. అయితే.. అన్నయ్య అధికారంలోకి వచ్చాక 8 నెలలు గడిచినా ఉలుకుపలుకు లేకపోవడం, ఆ కేసు ఊసెత్తకపోవడంతో ఆమెకు అసలు విషయం మెల్లగా బోధపడటం మొదలైంది. మధ్యలో ఆలస్యాన్ని ప్రశ్నించడానికి అన్నయ్య జగన్ ను కలవాలని ప్రయత్నించినా తగిన ఫలితం లేకపోవడంతో... ఆమెకు రోజురోజుకు అనుమానాలు బలపడటం మొదలైంది. చివరకు ఏకంగా అన్నయ్య పార్టీ సభ్యుల మీద ఆమె హైకోర్టుకు వెళ్లింది.

ముఖ్యమంత్రి పదవిలో ఉన్న జగన్ తన బాబాయి కేసును ఎందుకు సీబీఐకి ఇవ్వడం  లేదన్న అనుమానం ఇప్పటికే జనాల్లో ఉంది. దీనికి తోడు సునీత హైకోర్టులో దీనిపై పిటిషను వేశారు. సీబీఐకి కేసు అప్పగించాలంటూ ఆమె హైకోర్టును అడిగే పరిస్థితి వచ్చింది అంటే.. .దానికి కారణాలు రెండు అయ్యుండొచ్చు. ఒకటి... అన్నయ్య తనను కలవకపోవడం, దూరంగా ఉంచడం వల్ల ఆ డిమాండ్ చేసే అవకాశం రాకపోవడం. లేదా అన్నయ్యను అడిగినా ఆ పని చేయకపోవడం వల్ల కోర్టులో కేసు వేయడం. ఈ రెండింటిలో ఏదో ఒకటి నిజం. అయితే సాయంత్రం బయటపడిన ట్విస్ట్ ఏంటంటే... కోర్టులో వేసిన పిటిషనులో సునీత తన తండ్రి కేసుకు సంబంధించి కొందరిపై అనుమానాలు వ్యక్తంచేశారు. ఆ జాబితాలో 80 శాతం పేర్లు వైసీపీ నేతలవి, అందునా అందులో జగన్ సన్నిహితుడు బంధువు అయిన అవినాష్ రెడ్డి, ఆయన తండ్రిపేరు ఉండటం విశేషం. 

ఆమె సమర్పించిన పేర్లు ఇవే...

 • వాచ్‌మన్‌ రంగయ్య
 • ఎర్ర గంగిరెడ్డి
 • వైఎస్‌ అవినాష్‌రెడ్డి సన్నిహితుడు ఉదయ్‌కుమార్‌రెడ్డి
 • వైసీపీ రాష్ట్ర కార్యదర్శి శివశంకర్‌రెడ్డి
 • పరమేశ్వర్‌రెడ్డి
 • శ్రీనివాసరెడ్డి
 • వైఎస్‌ అవినాష్‌రెడ్డి తండ్రి భాస్కర్‌రెడ్డి
 • వైఎస్‌ మనోహర్‌రెడ్డి
 • వైఎస్‌ అవినాష్‌రెడ్డి 
 • సీఐ శంకరయ్య 
 • ఏఎస్‌ఐ రామకృష్ణారెడ్డి 
 • ఈసీ సురేంద్రనాథ్‌రెడ్డి
 • మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి
 • మారెడ్డి రవీంద్రనాథ్‌రెడ్డి 

ఇపుడు ఈ కేసు మీద రాష్ట్ర ప్రజలకు ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది. సోషల్ మీడియా సునీత సృష్టించిన ఈ సంచలనం మీద గోలపెడుతోంది. కొసమెరుపు ఏంటంటే... ఈరోజు సునీత ఎవరి మీద అయితే అనుమానాలు వ్యక్తంచేశారో... వారే ఈ హత్య వెనుక ఉండొచ్చని... చంద్రబాబు గత ఏడాదే సంచలన ఆరోపణలు చేశారు. ఇపుడు సునీత అవే అనుమానాలు వ్యక్తంచేయడం దేనికి సంకేతం. అప్పట్లో బాబు చేసిన వ్యాఖ్యలు కింది క్లిప్పింగ్ లో చూడొచ్చు.