వివేకా కేసు : జగన్ కి ఊహించని షాకిచ్చిన టీడీపీ 

July 04, 2020

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత బాబాయి, దివంగత నేత వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో గురువారం సంచలన పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డిలకూ ప్రమేయం ఉందంటూ జగన్ వర్గం చేసిన ఆరోపణలను తుత్తునియలు చేయడమే లక్ష్యంగా కేంద్ర మాజీ మంత్రి, దేశంలోనే ఓ ప్రముఖ న్యాయవాదిగా పేరొందిన సల్మాన్ ఖుర్షీద్ ను బీటెక్ రవి రంగంలోకి దించేశారు. గురువారం హైకోర్టులో జరిగిన విచారణ సందర్భంగా బీటెక్ రవి తరఫున సల్మాన్ ఖుర్షీద్ హాజరయ్యారు. సల్మాన్ ఎంట్రీతో ఈ కేసులో జగన్ అండ్ కోకు భారీ దెబ్బ పడే అవకాశాలు లేకపోలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.

వివేకా హత్య మొన్నటి ఎన్నికలకు కాస్తంత ముందుగా జరిగిన సంగతి తెలిసిందే. ఎన్నికల్లో సింపతీ కోసం జగన్ వర్గమే వివేకాను హత్య చేయించిందని టీడీపీ వర్గాలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే చంద్రబాబు హయాంలోనే ఈ కేసుపై విచారణ కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. అయితే ఎన్నికల కోడ్ పోలీసులు ఎటూ తేల్చకుండా జాప్యం చేశారు. కేసు దర్యాప్తులో పెద్దగా పురోగతి కనిపించలేదు. ఆ తర్వాత జగన్ సీఎం అయ్యాక... ఈ కేసు దర్యాప్తు కోసమంటూ అప్పటిదాకా పనిచేసిన సిట్ ను తొలగించేసి మరో సిట్ ను ఏర్పాటు చేశారు. అయినా కూడా కేసులో ఏమాత్రం పురోగతి లేదు. 

వివేకా కేసులో ఇప్పుడు వేళ్లన్నీ జగన్ వర్గం వైపే చూపిస్తున్నాయి. వివేకా సతీమణితో పాటు వివేకా కూతురు కూడా కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. అయితే జగన్ మాత్రం సీబీఐ దర్యాప్తు కోసమంటూ వేసిన పిటిషన్ ను వాపస్ తీసుకున్నారు. కొత్తగా బీటెక్ రవి, ఆదినారాయణ రెడ్డిలను కూడా అనుమానితుల జాబితాలో చేర్చారు. ఈ క్రమంలో జగన్ వర్గం వాదనను తిప్పికొట్టేందుకు బీటెక్ రవి చాలా డేరింగ్ స్టెప్పే వేశారు. తన తరఫున ఏకంగా సుప్రీంకోర్టు న్యాయవాదిగా ఉన్న కేంద్ర మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ ను దించేశారు. గురువారం నాటి విచారణలో ఖుర్షీద్ తనదైన శైలిలో వాదనలు వినిపించారు. ఈ కేసును సీబీఐకి అప్పగించాల్సిందేనని, అయినా సీబీఐ విచారణ కోసం దాఖలు చేసిన పిటిషన్ ను జగన్ ఎందుకు వాపస్ తీసుకున్నారో విచారించాలంటూ వాదించారు. ఖుర్షీద్ ఎంట్రీతో నిజంగానే జగన్ శిబిరంలో భయాందోళనలు మొదలయ్యాయన్న వార్తలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.  

Read Also

శాసన సభ, మండలి ప్రొరోగ్: ఆ రెండు బిల్లుల ఆర్డినెన్స్‌కు జగన్‌కు ఛాన్స్
సాల్లేబ్బా నీ సంబడం... ఐవైఆర్
స్వామి సొమ్ము.. స్వాములోరికి!?