వైఎస్ వివేకా హత్య కేసు - లేటెస్ట్ అప్ డేట్

August 08, 2020

సరిగ్గా 2019 ఎన్నికల ముందు కడపలో  జరిగిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య సంచలనం అయిన విషయం తెలిసిందే.

ఆయన సొంత ఇంట్లోని బాత్ రూంలో గొడ్డలితో నరికి చంపారు నిందితులు.

ఈ కేసు దర్యాప్తు విషయంలో రాష్ట్ర పోలీసులపై నమ్మకం లేదని, వైసీపీ అధినేత జగన్, వైఎస వివేకా కూతురు సునీత హైకోర్టుకు వెళ్లారు.

జగన్ అధికారంలోకి వచ్చాక సీబీఐకి ఈ దర్యాప్తును అప్పగిస్తూ వేసిన పిటిషను ఉపసంహరించుకున్నారు.

కానీ వైకాపా నేతల పేర్లు చెబుతూ వైఎస్ వివేకా కూతురు సునీత మాత్రం సీబీఐ దర్యాప్తు కావాలని కోర్టును కోరింది.

కేసు పురోగతిని పరిశీలించిన కోర్టు సీబీఐ దర్యాప్తుకు అప్పజెప్పిన విషయం తెలిసిందే. 

తాజాగా ఆ కేసులో సీబీఐ దర్యాప్తు మొదలైంది. సీబీఐ అధికారులు కడప ఎస్పీ అన్భురాజన్ ను కలిశారు.

సీబీఐ నుంచి ఏడుగురు అధికారులు ఎస్పీతో సమావేశం అయ్యారు.

ఆయన నుంచి సమాచారం సేకరించిన అనంతరం వారు పులివెందులకు వెళ్లనున్నారు.

స్థానికులతో సమాచారాన్ని సేకరించడంతో పాటు సంఘటన స్థలాన్ని పరిశీలంచనున్నారు. 

ఇదిలా ఉండగా... సీబీకి అప్పగించే నాటికే 1300 మంది అనుమానితులను ఈ కేసులో విచారించారు.

అంతమందిని విచారించి ఏడాది సమయం తీసుకుని పోలీసులు పురోగతి సాధించకపోవడాన్ని కోర్టు తప్పు పట్టింది.

కనీసం హత్యకు దారితీసిన కారణాలను కూడా గుర్తించలేకపోయిందని హై కోర్టు ఏపీ పోలీసుల తీరుపై అసంతృప్తి వ్యక్తంచేసింది.

అంతేకాదు, కేసుకు సంబంధించిన అన్ని రికార్డులు సీబీఐకి అప్పగించాలని హైకోర్టు ఆదేశించింది.

ఆ రికార్డులను స్వాధీనం చేసుకున్న సీబీఐ కేసు దర్యాప్తుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటుచేసింది. వారు దర్యాప్తులో భాగంగా కడప ఎస్పీని కలిశారు.