బే ఏరియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ విజ‌యోత్స‌వాలు

August 07, 2020

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఖండ విజ‌యం సాధించిన నేప‌థ్యంలో....ప్ర‌పంచ‌వ్యాప్తంగా వైఎస్ఆర్‌, వైఎస్ జ‌గ‌న్ అభిమానులు, పార్టీ నేత‌లు విజ‌యోత్స‌వాలు నిర్వ‌హించుకుంటున్న సంగ‌తి తెలిసిందే. ఇదే ఒర‌వ‌డిలో బే ఏరియా వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆధ్వ‌ర్యంలో జూన్ 25వ తేదీ శ‌నివారం ఫ్రీమాంట్‌లోని పార్టీ కార్యాలయంలో విజ‌యోత్స‌వాల‌ను నిర్వ‌హించారు.

పెద్ద ఎత్తున విచ్చేసిన ప్ర‌జ‌ల‌తో పాటుగా ముఖ్య అతిథి డాక్ట‌ర్ ల‌క్కిరెడ్డి హ‌నిమిరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాధించిన రికార్డు విజ‌యం ప‌ట్ల హ‌ర్షం వ్య‌క్తం చేశారు. వైఎస్ఆర్‌సీపీ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన కారు ర్యాలీలో యువ‌కులైన వైఎస్ఆర్‌సీపీ కార్య‌క‌ర్త‌ల‌తో స‌మానంగా మెర్సీడ్ నుంచి పార్టీ కార్యాల‌యం వ‌ర‌కు హ‌నిమిరెడ్డి స్వ‌యంగా కారు నడుపుకొని వ‌చ్చారు.
డాక్ట‌ర్ ల‌క్కిరెడ్డితో ఈ సంద‌ర్భంగా విచ్చేసిన వారు అనుసంధానం అయి అభిప్రాయాలు, ఈ భారీ విజ‌యం యొక్క సంతోషాన్ని పంచుకున్నారు మ‌రియు ఫ‌లితాల‌ను విశ్లేషించారు. ఈ సంద‌ర్భంగా సురేష్ ఉయ్యూరు మాట్లాడుతూ, ఇద్ద‌రు ఎన్నారైలు తాజా ఎన్నిక‌ల్లో ప్ర‌జాప్రతినిధులుగా ఎన్నిక‌య్యార‌ని పేర్కొన్నారు. మార్కాపురం నుంచి కుందూరు నాగార్జున రెడ్డి మరియు చిల‌క‌లూరిపేట నుంచి విడ‌ద‌ల ర‌జ‌నీ బే ఏరియాలోని ఎన్నారైలు అని పేర్కొంటూ వారి గెలుపు ప‌ట్ల సంతోషం వ్య‌క్తం చేశారు. ఈ సంద‌ర్భంగా డాక్ట‌ర్ ల‌క్కిరెడ్డి దంప‌తులు కేక్ కోశారు. వైఎస్ జ‌గ‌న్ యొక్క చిత్త‌శుద్ధి మ‌రియు క‌ఠోర శ్ర‌మ ఫ‌లితంగా ఈ విజ‌యం ద‌క్కింద‌ని పేర్కొన్నారు. కొత్త ప్ర‌భుత్వానికి శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తూ సుప‌రిపాల‌న కోసం బే ఏరియా ఎల్ల‌ప్పుడూ మ‌ద్ద‌తు ఇస్తుంద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. ఈ సంద‌ర్భంగా జ‌గ‌న్ మ‌రియు వైఎస్ఆర్‌సీపీకి చెందిన కార్య‌క‌ర్త‌ల‌కు ఉమా కొండూర్ శుభాకాంక్ష‌లు తెలిపారు.
బే ఏరియా వైఎస్ఆర్‌సీపీ కార్య‌క‌ర్త‌ల యొక్క సుదీర్ఘ‌కాల నైతిక మ‌ద్ద‌తు మ‌రియు వారు చూపిన ఓపిక‌ను ఈ సంద‌ర్భంగా సురేష్ ఉయ్యూరు అభినందించారు. దీంతోపాటుగా అభ్య‌ర్థుల‌కు అండ‌గా నిలిచిన వారంద‌రికీ ఆయ‌న ఈ సంద‌ర్భంగా కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.
ఉమాశంక‌ర్ మ‌లిరెడ్డి, వీర సుర‌వ‌రం, సీతారెడ్డి గోగుల‌మూడి, న‌రేశ్ కొండూర్‌, శంక‌ర్‌, కిర‌ణ్ కూచ‌భ‌ట్ల‌, జ‌గ‌దీశ్‌, రామ‌నాథ్‌, శ్రీ‌నివాసులు, పోలంరెడ్డి, సురేంద్ర పుల‌గం మ‌రియు హ‌రి అర్రంగు వైఎస్ఆర్‌సీపీ పార్టీ ఆఫీసు ఫ్రీమాంట్ వ‌ద్ద‌ ఈ కార్ ర్యాలీని రోల్స్ రాయిస్ (ఆర్‌.కే స్పాన్స‌ర్ చేశారు) నిర్వ‌హించారు.
గ్రేట‌ర్ ట్రైవ్యాలీ అసోసియేష‌న్ నాయ‌కులు సురేష్ త‌న‌మ‌ల‌, న‌రేంద్ర క‌ల‌కోట‌, నిలోథ‌ల్ రెడ్డి ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. అనిల్ గొట్టం, బంక విజ‌య్ భాస్క‌ర్ రెడ్డి, హ‌నుమా రెడ్డి చ‌ల్ల‌, న‌రేశ్ కొండూర్‌, ప్ర‌వీణ్‌, రామ‌కృష్ణ నంబూరి, సుబ్బారెడ్డి అంకిరెడ్డి, దిలీప్‌, ర‌ఘోత్తం రెడ్డి బొమ్మారెడ్డి, సురేంద్ర‌, ఎస్ఏపీ వెంక‌ట్ ఈ కార్య‌క్ర‌మంలో చురుగ్గాపాల్గొన్నారు.
టీవీ9 త‌ర‌ఫున సుగుణ గారు ఈ కార్య‌క్ర‌మాన్ని క‌వ‌ర్ చేశారు. దాదాపు 80 మందికి పైగా ప్ర‌జ‌లు, 40 కార్లు ఈ కార్య‌క్ర‌మంలో పాలు పంచుకున్నాయి.