టీడీపీకి కాదు.. ఏపీ ప్రజలకు నష్టం చేస్తున్న వైసీపీ, టీఆర్ఎస్

December 14, 2019

సాధారణంగా రాజకీయ, కార్యనిర్వాహక వ్యవస్థల మధ్య ఫ్రిక్షన్ ఉంటుంది. కానీ, అదేం విచిత్రమో.. తెలంగాణలో మాత్రం పొరుగు రాష్ట్రంపై కక్ష సాధించే ఏకైక లక్ష్యంతో ఈ రెండు వ్యవస్థలు ఒక్కటైపోయి తమకు అక్కర్లేని వ్యవహారంలో తలదూరుస్తున్నాయి. తమ రాష్ట్ర సమస్య కాదు, తమ ప్రజలకు నష్టం కలగలేదు.. అయినా తెలంగాణ నేతలు, అధికారులు మాత్రం తెగ స్పందించేస్తున్నారు. తెలంగాణలోని సమస్యలన్నీ గాలికొదిలేసి ఏపీ వ్యవహారాలపై దృష్టిపెడుతున్నారు. ముఖ్యంగా ఏపీ ఓటర్ల డాటాను పాలక టీడీపీ దుర్వినయోగం చేస్తోందంటూ కట్టుకథలు, పెట్టుబడులతో ఒక విష ప్రణాళిక రూపొందించి చంద్రబాబుపై రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ప్రజలు అనుకుంటున్నారు.

ఏపీ ప్రజల విలువైన డాటాను టీడీపీ దుర్వినియోగం చేస్తోందంటూ లోకేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదు చేయడం.. తెలంగాణ పోలీసులు స్పందించి ఆ ఐటీ కంపెనీకి చెందిన నలుగురు ఉద్యోగులను ఎత్తుకెళ్లడం తెలిసిందే. కానీ ఈ మొత్తం వ్యవహారంలో తెలంగాణ రాజకీయ పెద్దలు, అధికారులు కూడా చాలా బేసిక్ ప్రశ్నలకు సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు.

‘‘బ్లూ ఫ్రాగ్ అనే వైజాగ్ కంపెనీ ఆంధ్ర గవర్నమెంట్ డేటా ని మేనేజ్ చేస్తుంది.. ఐటీ గ్రిడ్స్ అనే హైదరాబాద్ కంపెనీ పార్టీ డేటాని మేనేజ్ చేస్తుంది.  బ్లూ ఫ్రాగ్ నుంచి గవర్నమెంట్ డేటాని ఐటీ గ్రిడ్స్ కంపెనీ దొంగిలించి పార్టీ పనులకు వాడుకుంటోందన్నది తెలంగాణ పోలీసులు, ప్రభుత్వ పెద్దల ఆరోపణ. అలాంటప్పుడు దొంగిలించారన్న డేటా ఎవరిది? ఆంధ్ర గవర్నమెంట్ ది. అవునా? మరి ఆంధ్ర గవర్నమెంట్ కదా అభియోగం మోపాల్సింది? మీకెందుకా దురద... ? ఏపీ ప్రజలు అడుగుతున్న ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు తెలంగాణ ప్రభుత్వం, అధికారులు సమాధానం చెప్పకుండా ఏదేదో చేస్తున్నారు.

సరే... దొంగిలించిన డేటా మీ రాష్ట్రంలో ఉన్న హైద్రాబాదులో దొరికింది అనుకున్నా.. దొంగతనం జరిగింది ఏపీ డాటా కాబట్టి అక్కడి పోలీసులకు కేసు అప్పగించాలి. 

సరే... ప్రజల ఆధార్ నంబర్లు దోచుకున్నారంటున్నారు. ఆధార్ నంబర్‌తో ఏం చేయగలరు? పేరు, వయసు, పుట్టిన తేదీ, ఆడామగా, అడ్రసేంటి వరకు మాత్రమే తెలుసుకోగలరు.  అంతకంటే ఇంకేమైనా ఎక్కువగా తెలుస్తుందా? ఇందులో నేరమేముంది?

ఇంకా చెప్పాలంటే ఇదంతా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, కార్యకర్తలు కానివారికి కూడా లబ్ధి చేకూర్చేలా సేకరించిన సమాచారం. వారికి ఇన్సూరెన్స్ కల్పించడం కోసం.. వారికి అనుకోని ప్రమాదం వస్తే బ్లడ్ అందించడం కోసం.. ఇలా ఎన్నో ముందు జాగ్రత్తలతో సేకరించిన సమాచారం. కానీ.. ఏపీలోని విపక్షం వైసీపీ, తెలంగాణలోని శత్రుపక్షం టీఆరెస్ కలిసి దొంగనాటకాలు ఆడుతూ తమకు మంచి జరగకుండా అడ్డుకుంటున్నారని ఏపీ ప్రజలు అంటున్నారు.