సున్నా వడ్డీ... షాకింగ్ నిజం 

August 05, 2020

చంద్రబాబు పసుపు కుంకుమ కింద మహిళలకు ఎంతిచ్చారు? ఈప్రశ్న ఏపీలోని ఏ మహిళను అడిగినా, ఏ పిల్లాడిని అడిగినా... ఏ ఒక్కరిని అడిగినా ఠక్కున 10 వేలు ఇచ్చాడు అని సమాధానం చెబుతారు. అంతేకదా. నిన్న ఘనంగా జగన్ సున్నా వడ్డీ పథకం ప్రారంభించారు. (ఫొటో చూశారా... లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించి పక్కపక్కనే అతుక్కుని నిలబడ్డారు... ఇది వేరే పార్ట్). ఆడంబరంగా చెప్పుకున్న ఈ పథకంలో ఒక్కో మహిళకు ఎంత వస్తుంది చెప్పగలరా? 

కొంచెం కష్టం కదా. జగన్ సర్కారు కేటాయించిన డబ్బు 1400 కోట్లు. అమ్మో చాలా పెద్ద అమౌంటే అనుకుంటున్నారా? ఎంత మందికి అనేది కూడా మీరు తెలుసుకోవాలి. ఈ పథకం లబ్ధిదారుల సంఖ్య 93 లక్షలు. కొంచెం మీ ఫోన్ తీసి మీ క్యాలిక్కులేటర్ ఓపెన్ చేసి ఒక్కొక్కరికి ఎంత వస్తుందో చూడండి. అర్థమైందా... అంటే ఒక్కో మహిళకు 1500 రూపాయలు మాత్రమే. చంద్రబాబు ఇచ్చిన 10 వేలు ఎక్కడ? జగన్ ఇస్తున్న 1500 ఎక్కడ. మీరో పాయింట్ గమనించాలి. అందరికీ ఇస్తేనేమో 1500 వస్తుంది. కొందరికి ఆ కోత ఈ కోత ఆ రూలు ఈ రూలు అని చెప్పి ఎగ్గొడితే ఏమో ఇంకా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. మరి 1500 సున్నా వడ్డీకి అప్పిస్తే వారేం చేసుకోవాలి? ఒకవేళ మీరు లబ్ధిదారులను తగ్గిస్తే అర్హత కోల్పోయిన మహిళలు ఏమైపోవాలి.

ప్రచారం ఏమో ప్రపంచం మొత్తం తెలిసేలా చేస్తారు. సాయం మాత్రం అరచేయి కూడా నిండదు అన్నట్లుంది జగన్ సర్కారు పరిస్థితి. అసలే కరోనా వల్ల ప్రభుత్వాలకు ఆదాయం లేదు. ఇపుడు ఆ పథకం పెట్టడం అంటే నెత్తిమీద భారం. ఓట్ల కోసం చేస్తున్న వేటలో భాగమైన ఈ పథకం కోసం వాడిన డబ్బులు ఎక్కడివో తెలుసా? ప్రభుత్వ ఉద్యోగుల జీతాలను కోసం ఇలా తమ పార్టీ ఓట్ల కోసం జనాలకు సంతర్పణ చేస్తున్నారు. కానీ చంద్రబాబు మీద ఒంటికాలిమీద లేచే ఉద్యోగులు జగన్ జీతాలు కోస్తున్నా కిమ్మనడం లేదు. ఆ డబ్బులతో రాజకీయం చేస్తున్నా ఎక్కడ సస్పెండ్ చేస్తారో అని వణికిపోతున్నారు.