ఇదీ వైసీపీ విశ్వరూపం

May 30, 2020

వైసీపీ అధికారంలోకి వస్తే ఏం జరగుతుందో 2014లో జనాలందరూ ఊహించారు. భయపడ్డారు. అందుకే తిరస్కరించారు. కానీ ఐదేళ్లు  ఓపిక పట్టాడు మనిషి మారి ఉంటాడేమో అని అనుకున్నారు. ఒక్క ఛాన్స్ అంటే అవకాశం ఇచ్చారు. మనిషికే కాదు... ప్రతి పార్టీకి ఒక లక్షణం ఉంటుంది. అది ఎన్నటికీ పోదు. 

ప్రజాస్వామ్యంలో ఎవరికైనా నిరసన తెలిపే హక్కు ఉంటుంది. జగన్ తీసుకున్న నిర్ణయాలపై కొందరు శాంతియుతంగా టెంటు వేసి దీక్షలు చేస్తున్నారు. మీరిలా దీక్షలు చేస్తే మా జగన్ ఏమైపోవాలి. మా జగన్ పాలన కు వ్యతిరేకంగా దీక్షలు చేస్తారా? అంటూ కోడిగుడ్లు టమోటాలతో వైసీపీ కార్యకర్తలు దాడికి దిగారు. దీక్షా వేదికకకు నిప్పు పెట్టారు. అంటే... జగన్ పాలనపై ఎవరూ నోరు విప్పకూడదు. ఇదేమైనా రాచరికమా? మరీ ఇంత అరాచకమా? ఒక టెంటులో దీక్ష చేస్తుంటే వచ్చి నిప్పు పెట్టడం ఏంటి?