వాడుకోవడంలో ఎంతో ఎత్తుకు ఎదిగిన జగన్

June 05, 2020
CTYPE html>
దేశంలో కరోనాని కూడా రాజకీయాలకు వాడుకున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డి. కేంద్రం పేదలకు కరోనా లాక్ డౌన్ లో పొట్ట నింపుకోవడం కోసం వెయ్యి రూపాయలు ఇస్తే దానికి వైకాపా స్టిక్కర్లు వేసి పంచుతున్నారు ఏపీ నాయకులు. అదేదో రాష్ట్ర ముఖ్యమంత్రి పంచుతున్నట్లు స్టిక్కర్లు వేయడమే కాకుండా ఈ డబ్బు తీసుకుని రాబోయే పంచాయతీ ఎన్నికల్లో వైకాపాకే ఓటేయాలని ప్రచారం చేస్తున్నారట.
దీనిపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తీవ్రంగా మండిపడ్డారు. సంక్షోభ సమయంలో స్వార్థరాజకీయాలు ఏమిటి జగన్? స్థాయికి తగ్గట్టు వ్యవహరించండి అంటూ విమర్శించారు. వాలంటీర్లు వైకాపా కార్యకర్తలు కలిసి కరోనా సమయంలో డబ్బలు పంచుతూ ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఇంతకంటే హేయమైన చర్య ఏమైనా ఉంటుందా అని ఆయన ప్రశ్నించారు.
ఏపీలో మరో విచిత్రం జరిగింది. ప్రభుత్వం ఎమర్జెన్సీ కింద ఏర్పాటుచేసిన కరోనా ఐసోలేషన్ వార్డులను ఏపీ మంత్రులు రిబ్బన్లు కట్ చేయడం కూడా తీవ్ర విమర్శల పాలైంది. జనం చస్తుంటే... మీకు ప్రారంభాలు, సంబరాలా అంటూ జనం విమర్శిస్తున్నారు. ఈ పనిచేసిన విడదల రజిని, అవంతి శ్రీనివాస్ ని జనం ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు.