కోర్టుకు సవాల్ విసురుతున్న జగన్ జీవో

August 06, 2020

తప్పొప్పులతో పనిలేదు

రాజ్యాంగంతో సంబంధం లేదు

ప్రజాప్రాయంతో పనే లేదు

తాను తలచింది జరగాలి. తాను అనుకున్నది అయిపోవాలి. ఇదే తీరులో సాగుతున్నారు ఏపీ ముఖ్యమంత్రి జగన్. నిబంధనల ప్రకారం నడుకుంటే ప్రాణం పోతుందేమో అన్నట్లుంది జగన్ వ్యవహారం. ఇప్పటికు 50 సార్లకు పైగా కోర్టులు తప్పుపట్టాయి జగన్ ని. ఇది ఆల్ టైం రికార్డు. 10 నెలల్లో ఇన్ని సార్లు ఏ ముఖ్యమంత్రి కోర్టులతో తిట్లు తినలేదు. అయినా జగన్ తగ్గడం లేదు. 

ఎన్నికల్లోపు వైకాపా రంగులు తొలగించాలని కోర్టు ఆదేశాలు జారీ చేస్తే అవమానంగా ఫీలవయిన జగన్... ఆ మూడు తొలగించను. అవసరమైతే నాలుగు రంగులు వేస్తాను అంటూ కోర్టుకు సవాల్ విసురుతూ నిర్ణయం తీసుకున్నారు. తనకు మాత్రమే తెలివితేటలు ఉన్నట్టు నచ్చిన అర్థం చెప్పుకువస్తున్నారు ఆ రంగులకు. 

తాజాగా జారీ చేసిన జీవో లో  ఆ నాలుగు రంగులు వాటి అర్థాలు జగన్ సర్కారు వివరించింది. చిన్నపిల్లాడయినా ఇది ఉద్దేశపూర్వకంగా తయారుచేసిన జీవో అని అర్థమైంది. అక్షరం అక్షరంలో ఇగో కనిపిస్తుంది. హైకోర్టులో, సుప్రీంకోర్టులో అవమానం జరిగింది. ఇందులో వెనక్కు తగ్గితే బలహీనపడిపోతాం. మన సత్తా ఏంటో చూపాలి అన్నట్టు ఉంది కొత్త రంగుల వ్యవహారం. జీవోలో రంగుల గురించి ఏం చెప్పారో చూద్దాం.

ఎరుపు (టెర్రకోట) - ‘నేలకు ప్రతీకగా ఎర్రరంగు, 

ఆకుపచ్చ (వైకాపా) - పాడి పంటలకు ప్రతీకగా ఆకుపచ్చ 

నీలం (వైకాపా) - నీలి(ఆక్వా) విప్లవానికి ప్రతీకగా నీలం రంగు 

తెలుపు (వైకాపా) -  పాల విప్లవానికి ప్రతీకగా తెలుపు రంగులు వేయాలి. 

తన మూడు రంగులతో పాటు బీజేపీ మద్దతు కోసం కాషాయం వేసినట్టుంది ఈ రంగుల కలయిక. ఇంతా చేస్తే.. అదే జీవోలో జాతీయ భవన విధానం ప్రకారం నడుచుకోవాలి. ఏ రాజకీయ పార్టీ రంగులను, చిహ్నాలను వొద్దు’ అని ఉత్తర్వులో పేర్కొనడం హైలైట్. ఒకటి బీజేపీ రంగు... మిగతా మూడు సేమ్ టు సేమ్ వైకాపా రంగులే... ఈ మాత్రం దానికి రంగులు మార్చకపోతే రాష్ట్రానికి డబ్బులు అయినా మిగుల్తాయి అంటున్నారు జనం.