జగన్ రెడ్డి పార్టీ డబుల్ టంగ్...

February 24, 2020

దేశంలో పౌరసత్వ సవరణ బిల్లు పెద్ద ఎత్తున రచ్చకు కారణమవుతోంది. ఈ బిల్లుపై పూర్తిగా అవగాహన లేకుండా లేనిపోనివి ఊహించుకుని ధర్నాలకు దిగుతున్నారని, ఆస్తుల ధ్వంసానికి పాల్పడుతున్నారని, ఈ బిల్లులో భయపడాల్సింది ఏమీ లేదని... ఇందులో ఇప్పటికే భారతీయులు అయిన ఏ మతం వారికి ఏ నష్టమూ జరగదని ప్రధాని పిలుపునిచ్చారు. అయినా ఆందోళనకారులు దుష్ప్రచారాన్ని నమ్మి ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు. 

అయితే... లోక్ సభ, రాజ్యసభల్లో ఈ బిల్లుకు వైసీపీ సంపూర్ణంగా మద్దతు ఇచ్చింది. ఏకంగా మోడీకి పాదాభివందనం చేసే జగన్మోహన్ రెడ్డి, బీజేపీని పల్లెత్తు మాటనని వైసీపీ దీనికి వ్యతిరేకంగా ఓటేస్తుందని ఎవరూ ఊహించలేదు, ఆశించలేదు. జై బోలో మోడీకి అంటూ రెండు సభల్లోనూ మిథున్రెడ్డి, సాయిరెడ్డి నాయకత్వంలో బిల్లుకు మద్దతు పలికారు. 

ఇక తనను తాను ముస్లింలకు ఆరాధ్య దైవంగా భావించే జగన్ రెడ్డి... రాష్ట్రంలో ముస్లిం వర్గాలు మనసు నొచ్చుకోకుండా కొత్త గేమ్ ఆడుతున్నారు. తన ముస్లిం డిప్యూటీ సీఎం చేత... ఈ బిల్లును అమలు చేయకుండా అడ్డకుంటామని చెబుతున్నారు. పైనంతా బిల్లు పాస్ చేయించి ఇక్కడ ఈ చిల్లర మాటలేంది అని జగన్ రెడ్డిని సోషల్ మీడియా ఆడుకుంటోంది. ముస్లింలకు అన్యాయం జరిగితే ఊరుకోరట, ప్రొటెస్ట్ చేస్తారట. చెబితే నమ్మరు గాని కింద లింకులో వీడియో ఉంది చూడండి.

https://twitter.com/i/status/1207643613699747841