వైసీపీ గాలి తీసిన సుజనా...

August 03, 2020

ఏపీ పాలకులకు ఈ దేశం రాజ్యాంగం ప్రకారం నడుస్తుంద్న విషయం గుర్తుందా అంటూ బీజేపీ ఎంపీ సుజనా చౌదరి విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్ అనాలోచిత తీరు వల్ల రాష్ట్రానికి చెప్పలేనంత నష్టం జరిగిందన్నారు. ఏడాది కాలంలో ఒక్క ప్రాజెక్టు కూడా ముందుకు కదల్లేదని ధ్వజమెత్తారు. భారీ మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన వైసీపీ ఇకనైనా అభివృద్ధి కోసం చర్యలు తీసుకోవాలని, మెజారిటీ సుస్థిర అభివృద్ధికి ఉపయోగించాలి గాని రాజకీయ నిర్ణయాలకు కాదని సుజనా సూచించారు.  

ఇక మరోసారి ఏపీ రాజధాని గురించి పాతపాటే పాడారు సుజనా.  గురువారమే ఒకవైపు బీజేపీ కొత్త అధ్యక్షుడు ‘‘రాజధానితో కేంద్రానికి సంబంధం లేదు‘‘ అని వ్యాఖ్యానించడం చూశాం. అదే రోజు దానికి కౌంటర్ అన్నట్టుగా ‘‘బిల్లులపై నిర్ణయం తీసుకోబోయేది కేంద్రమే’’ అని సుజన చౌదరి మరోసారి స్పష్టం చేశారు. రాజ్యసభ సభ్యుడిగా ఈ విషయాన్ని ఘంటాపథంగా చెప్పగలననంటూ ఆశలు రేపేలే మాట్లాడారు.  

‘‘అసెంబ్లీలో మెజార్టీ ఉంటే పెంచాల్సింది అభివృద్ధి, రాజధానులు కాదు‘‘ అని చురకంటించారు.  అసలు శాసనమండలి ఆమోదించకుండా రాజధాని బిల్లును గవర్నర్ కు పంపడమే రాజ్యాంగ విరుద్ధం అన్నారు జగన్. అసలింతకీ ఆ బిల్లులు ఎక్కడున్నాయో ఎవరికీ క్లారిటీ లేదన్నారు. సెలెక్ట్ కమిటీ వ్యవహారమూ తేలలేదు. 

ఇదంతా పక్కన పెడితే... ఎవరెన్ని చెప్పినా.. రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర రాజధాని వ్యవహారంలో తుది నిర్ణయం కేంద్ర ప్రభుత్వానిదే, ఈ విషయాన్ని ఒక రాజ్యసభ సభ్యుడిగా కచ్చితంగా చెబుతున్నాను అంటూ సుజనా వ్యాఖ్యానించారు. అసలు ఈ బీజేపీ నేతల కథలు ఎవరిది నమ్మాలో తెలియక ప్రజలు పిచ్చోళ్లవుతున్నారు.