ఇంత దిగజారుడు రాజకీయమా... భగవాన్ !!

August 10, 2020

ఒకానొక సామాన్యుడు

బతుకు తెరువుకు టీకొట్టు నడుపుతున్నాడు

ఆ ఆదాయంతో ఇల్లు గడిపి ఇద్దరు పిల్లలను చదివించడం మాటలు కాదు

కరోనా కొంపముంచింది, కుటుంబం రోడ్డున పడింది... ఊరి బాట పట్టాడు

సరిగ్గా 2 ఎకరాలు కూడా లేదు. ఆదాయం లేక ఉన్న డబ్బులు అయిపోయాయి

కొంచెం పొలమే కదా, నేల మెత్తగా ఉందని దున్నడానికి కూతుర్లు సహాయం చేశారు

సరే ఎపుడూ చేయం కదా గుర్తుంటుందని వీడియో తీశారు. 

అది బంధువులకు చేరింది

వారి ద్వారా ఇంటర్నెట్ కి ఎక్కింది

అదలా సోనూసూద్ కి అందింది

ఆయన మనసు కరిగింది

వాళ్లేమీ సాయం కోసం ఎవరినీ దేబిరించలేదు 

సోనూసూద్ తనంతట తానే ట్రాక్టర్ ఇచ్చాడు

......

జగనన్నకు కోపం వచ్చింది

ట్రాక్టరిచ్చి నా రాజ్యాన్ని అవమానిస్తారా? అని ఫీలైనాడు

అధికారులను ఇంటి మీదికి పంపినాడు

వాళ్లను ఇంటరాగేట్ చేసినంత పనిచేసినారు

అధికారులు మీడియా ముందుకు వచ్చినారు

ఏయ్ థీ... వాళ్లకు అన్నీ ఇచ్చినాం...

సూపరున్నారు, అని ప్రగల్బాలు పలికినారు

...

వైసీపీ సోషల్ మీడియా బ్యాచ్ దిగింది

వాళ్లకేమిచ్చింది లెక్కలు కట్టింది

ట్రాక్టర్ వెనక్కిచ్చేస్తున్నట్టు ఆయన పేరుపై ఫేక్ పోస్టులు పెట్టింది

జగగన్న రాజ్యంలో ఇచ్చిన దాంతో బతకాలి.

ప్రభుత్వ పథకాలు తీసుకున్న తర్వాత ఇంకే సాయం తీసుకోకూడదు అన్నట్లు బెదిరించినంత పనిచేసింది.

...

అయ్యా ఆ మంచాయన నా కష్టం చూశాడు

సాయం చేశాడు... ఇంకొంచె బాగుపడతాను

పిల్లలను చదివించుకుంటాను

నేను ట్రాక్టరు వెనక్కు ఇస్తాను అని ఎవరితో అనలేదు

సోషల్ మీడియాలో ఎవరెవరో నా పేరుతో పోస్టులు పెడతాఉండారు 

మీ అందరికీ చెబుతున్నా... మీరెవరో, నేనెవరో, నా ఇంటికొచ్చి నాకష్టం చూశాక మాట్లాడండి

నేను డిగ్రీ చదివాను, నా కూతుర్లు ఇంటర్, టెన్త్ పూర్తయ్యింది

ఇంకా చదివిస్తాను 

- మమ్మల్ని వదిలేయండి, ఇట్లు దళిత రైతు నాగేశ్వరరావు

......

వైసీపీ చెప్పిందేంటి?

తల్లిదండ్రులకు పెన్షన్ ఇస్తున్నారు...! ఎవరికి వాళ్ల నాన్న అమ్మకి అది వారు బతకడానికి సరిపోయింది

చిన్నమ్మాయికి అమ్మఒడి ఇచ్చారు... ఏడాదికి 15వేలు.. మరి పదోతరగతి అమ్మాయి స్కూలుకు అది సరిపోతుందా... పుస్తకాలు, ట్యూషన్లు, ఫీజులు, బట్టలు... ఎన్నుంటాయి?

పెద్దమ్మాయికి దరఖాస్తు పెట్టింది ఏమీ రాలేదు.

ఆయనకు వడ్డీలేని పథకం కింద పెట్టుకోవచ్చన్నారు... అప్పు కట్టాలి కదా. తిరిగి.. అది ఉచితం కాదు కదా. అందుకని తీసుకోలేదు

నెలకు వెయ్యి మోడీ ఇచ్చిన డబ్బులు అందాయి... రేషన్ అందింది... నలుగురికి అవి సరిపోతాయా? ఎదిగిన ఆడపిల్లలున్న ఇంట్లో?

వీటితోనే మనుషులు బతికేస్తారా?. ఇంతకుమించిన అరాచకం ఏముంది? జగన్ సర్కారు ఇవ్వలేదని ఆయన చెప్పడం లేదు. తన కష్టం తాను పడుతుంటే ఎవరో సాయం చేశారు. తీసుకోవద్దని గవర్నమెంటు, అధికార పార్టీ పరోక్షంగా ఒత్తిడి తేవడం ఏంటి? 

ఆ దళిత కుటుంబానికి ట్రాక్టర్ అందడంతో పెద్ద అండ దొరికింది. ఇందులో తప్పేముంది. సర్కారుకి జరిగిన నష్టమేంటి?

సోను సూద్ సాయంతో ఆ కుటుంబం ఒక మెట్టు ఎక్కింది.

చంద్రబాబు సాయంతో ఆ కటుంబంలోని ఆడపిల్లల చదువులకు భరోసా దొరికింది

మధ్యలో జగన్ మోహన్ రెడ్డికి జరిగిన అన్యాయం ఏంటి?