వైసీీపీ సర్కారు ఘన కార్యం: ఒక టెంటు కథ !

August 03, 2020

ఒక వైపు విద్యా వ్యవస్థను ముఖ్యమంత్రి జగన్ సమూలంగా మారుస్తాను అంటాడు. మాటల్లో బలంగా వినిపిస్తోంది. చేతల్లో టెండర్ల లాగే ఇది కూడా రివర్సులో జరుగుతోంది. 80 ఏళ్ల బడిని రోడ్డు పాలు చేశారు. కేవలం స్థానికుల దయతో ఆ స్కూలు బతికింది. స్వయానా గవర్నమెంటు స్కూలు పిల్లలను రోడ్డు మీదకు పొమ్మని గెంటేసింది అంటే.. ఆ దుస్థితి ఎంత ఘోరగా ఉంటుందో ఊహించుకోండి.

​విజయవాడ దగ్గరలోని నిడమానూరులో సీబీసీఎన్‌సీ ఎయిడెడ్‌ ప్రాథమిక పాఠశాల 80 ఏళ్లుగా ఉంది. స్కూలు భవనం పాతబడటంతో సీబీసీఎన్‌సీ చర్చి ఆవరణలో పాఠాలు చెప్పడం మొదలుపెట్టారు. కొన్నేళ్ల తర్వాత అదీ పాత బడటంతో ఖాళీగా ఉన్న కమ్యూనిటీ హాలులోకి బడిని  మార్చారు. దానిని కొత్తగా సిద్ధం చేశారు. ఏడేళ్లుగా ఇందులోనే పాఠశాల నడుస్తోంది. కానీ... జగన్ సర్కారు వచ్చాక... గ్రామ సచివాలయం అంటూ తెగ హడావుడి చేస్తున్నారు. కానీ ఈ పాఠశాలకు వైసీపీ రగులు వేసి గ్రామ సచివాలయంగా మార్చేశారు. పిల్లలను రోడ్డు మీదకు లాగేశారు. ఇక స్థానికులే దయతలచి టెంటు వేయించారు. ఇది 6 నెలల ఉత్సవాలు జరుపుకుంటున్న జగన్ సర్కారు కథ.