అయ్యోరాామా... వైసీపీ కర్మరా మామా

July 14, 2020

సుప్రీంకోర్టు తాజా షాక్ తో పార్టీలు ఉలికిపడిన విషయం తెలిసిందే. వైసీపీది మరీ స్పెషల్. సౌతిండియాలో అత్యధిక నేరస్థులను కలిగిన పార్టీ అది. కోర్టు ఆదేశాల ప్రకారం ఏ నేతలు నేరస్థులో జనాలకు తెలియాలి కాబట్టి చిట్టాలు పెట్టమని చెబుతోంది. నిజానికి ఇది మిగతా పార్టీకి అవసరం ఏమోగాని వైసీపీకి పెద్దగా అవసరం లేదు. వారు నిరంతరం తమ అరాచకాలను మీడియా వేదికగా, అసెంబ్లీ వేదికగా ప్రదర్శిస్తుంటారు. ఆ పార్టీ నేతలు ఎలా ప్రవర్తిస్తారో, ఎవరెంత రౌడీయిజం చేస్తారో అందరికీ తెలుసు. ఈ విషయంలో వైసీపీ నేతలు అస్సలు మొహమాట పడరు.

 

ఇదంతా ఒకవైపు... తాజాగా  వైసీపీ నేత‌ల నేర చ‌రిత్ర‌పై అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రీఫార్మ్స్(ఏడీఆర్) విడుద‌ల చేసిన‌ ప్రత్యేక నివేదిక ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది. అందులో సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో పోటీ చేసే స‌మ‌యంలోనే త‌మ నేర చ‌రిత్ర వివ‌రాల‌ను ఎమ్మెల్యే, ఎంపీ అభ్య‌ర్థులు నామినేష‌న్‌లో పొందుప‌ర‌చాల‌ని, అంతేకాకుండా ప్రింట్, ఎల‌క్ట్రానిక్ మీడియాలో బ‌హిరంగ ప్ర‌క‌ట‌నలు ఇవ్వాన‌లి కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఆదేశాలు జారీ చేసింది. అది పెద్దగా అమలైన చరిత్ర లేదు.   ఈ నేప‌థ్యంలోనే 2019 ఎన్నికల్లో గెలిచి... పదవులు చేపట్టిన వారి నేర చ‌రిత్ర వివ‌రాల‌పై ఏడీఆర్ ఓ స‌మ‌గ్ర నివేదిక రూపొందించింది. ఇందులో జ‌గ‌న్ టీం అన్ని రికార్డులను బద్దలుగొట్టింది.

చిత్రం ఏంటంటే... వైసీపీ అధినేత ముఖ్యమంత్రిపైనే 38 కేసులుండటం.  ఏడీఆర్ నివేదికలో నేరాలు, కేసులతో స‌హా ఒక్కో ఎమ్మెల్యే పేరును ప్రస్థావిస్తూ ఆయా కేసుల వివ‌రాలు, వాటిలోని పురోగతిపై నివేదికనిచ్చింది. ఈ నివేదిక‌లో మంత్రులు మేకపాటి గౌతమ్ రెడ్డి, మోపిదేవి వెంకటరమణ‌, శంకర నారాయణ, బాలినేని శ్రీనివాసరెడ్డి, పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాసరావు, అనిల్ కుమార్ యాదవ్, మేకతోటి సుచరిత, కొడాలి నాని, కురసాల కన్నబాబు, బుగ్గన రాజేంద్రనాథ్, పిల్లి సుభాష్ చంద్రబోస్, పాముల పుష్పశ్రీ వాణి..వంటి మంత్రులపై ఉన్న కేసుల వివరాల‌ను ఏడీఆర్ రిపోర్టులో వెల్ల‌డ‌య్యాయి. అన్ని పార్టీల వారు నేరాలు చేసినా.... రికార్డులు మాత్రం వైసీపీ పైనే ఉన్నాయి. 

Read Also

'యథారాజా.. తథా నాయకులు'.
స్ఫూర్తిదాయకంగా అయ్యన్నపాత్రుడి ప్రసంగం
సంక్రాంతికి అందని జీతం