కుమిలిపోతున్న వైసీపీ నేతలు 

August 05, 2020

వైసీపీలో అంతర్మథనం జరుగుతోందా? రాజ్యసభ సీట్లు, మంత్రి పదవులు, దళితుల సమస్య, అమరావతి సమస్య, తాాజాగా నిమ్మగడ్డ ఇష్యూ. పార్టీకి అప్రతిహతమైన మెజారిటీ రావడం పార్టీకి మాత్రమే కాదు, మాకు కూడా బాగా నష్టం చేసిందని ఎమ్మెల్యేలు భయపడే పరిస్థితి.

వైసీపీ మొత్తం మీద సీనియర్లు మహా అయితే 50 మంది ఉంటారు. వారంతా పార్టీ వదిలేసినా ప్రభుత్వం పడిపోదు.

అందుకే సీనియర్లు గాని జూనియర్లు గాని ఏదయినా సలహా వచ్చి, ఐడియా ఇవ్వాలన్నా జగన్ కి చెప్పలేకపోతున్నారు.

అసలు ఇంత మెజారిటీ రావొద్దబ్బా... మనకే నష్టం అని గుంటూరు జిల్లా వైసీపీ ఎమ్మెల్యే  ఒకరు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు.

రాజధాని తరలిపోతే మళ్లీ తాము గెలవడం కలే అని వ్యాఖ్యానించారాయన. 

ఇక శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నేత, గోదావరి జిల్లా నేత, రాయలసీమకు చెందిన ఇద్దరు నేతలు మంత్రి పదవుల పంపకంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు.

పార్టీని గెలిపించిన వారికి కాకుండా పార్టీ వల్ల గెలిచిన వారికి పదవులు ఇస్తే ఇక మేమెందుకు అని ఆవేదన చెందుతున్నారు.

ఎంత అసంతృప్తి ఉన్నా బయటకు చెప్పుకోలేకపోవడానికి కారణం... లెక్కలేనన్ని సీట్లు రావడమే. ప్రతి ఎమ్మెల్యే ఇపుడు నా అవసరం జగన్ కి లేదు అనుకుంటున్నారు.

అందుకే... బయటకు వెళ్లి ఏం చేద్దాం కొంతకాలం సైలెంట్ గా ఉంటేనే బెటర్ అని లోపలే కుమిలిపోతున్నారు. 

చాలామంది కోస్తాంధ్ర, రాయలసీమ ఎమ్మెల్యేలకు రాజధాని తరలింపు ఇష్టం లేదు.

కానీ తప్పక జైకొట్టాల్సిన పరిస్థితి. ప్రజల్లో 3 రాజధానిపై కోరిక గాని ఉత్సాహం గాని కనపడం లేదు. ఎందుకీ రచ్చ సైలెంటుగా తన పనితాను చేసుకోక అనుకుంటున్నారు గాని ఎవరికి చెప్పాలి.

అంతా కుటుంబ స్వామ్యమే పార్టీలే. ఎందుకొచ్చిన గొడవలే అని ఊరికే ఉంటున్నారు. 

ఇక నిమ్మగడ్డ కేసు విషయంలో జగన్ తీరు చాలా మంది వైసీపీ ఎమ్మెల్యేలకే నచ్చడం లేదని రఘురామ రాజు చెప్పారు.

వారంతా బయటకు చెప్పుకోలేక లోపలే కుమిలిపోతున్నారట. పార్టీ అభిమానులే నవ్వుకునే పరిస్థితి. ఈ విషయం ప్రభుత్వం గెలిచే అవకాశమే లేకపోయినా అవగాహనరాహిత్యంతో ముందుకు పోయి ముప్పు తెచ్చుకున్నారని రఘురామ రాజు చెప్పారు.

పార్టీ అభిమానులు కూడా ఈ విషయంలో నవ్వుకుంటున్నారని రఘరామరాజు వ్యాఖ్యానించడం గమనార్హం. 

అన్ని చిక్కులకు కారణం 151 సీట్లే... అసలు ప్రజలు కూడా దీనివల్ల నోరెత్తలేని పరిస్థితి.

రాష్ట్రాలు బాగుపడాలంటే తక్కువ మెజారిటీ రావాలని, పాలకుల్లో కాస్త అభద్రత ఉండాలని అంటున్నారు.

ముఖ్యంగా సీనియర్లు పార్టీ నడిపే తీరుపై ఏ మాత్రం సంతృప్తిగా లేరు. ముఖ్యంగా ముగ్గురు రెడ్లకు పార్టీ అప్పగించినప్పటి నుంచి ఎవరికి వారు తమను తాము బానిసల్లా ఫీలవుతున్నారట.

మొత్తానికి జగన్ తనంతట తానే బిగ్ సెల్ఫ్ గోల్ వేసుకున్నారు. ఇప్పటికే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత తెచ్చుకున్న జగన్ ఇపుడు సొంత క్యాడర్లోనూ వ్యతిరేకత తెచ్చుకుంటున్నాడు.