జగనా మజాకా... పిచ్చెక్కించిన ఏపీ సర్కార్ ... !

June 01, 2020

ఇలాంటి సీఎం నెవర్ బిఫోర్

ఇలాంటి ఫాలోయర్స్ ఎవర్ ఆఫ్టర్ 

ఇదీ ఏపీలో పరిస్థితి. దేశ వ్యాప్తంగా అది ఇది లేకుండా... ప్రతిదీ నిషిద్ధం. కానీ ఏపీలో మాత్రం ఏకంగా భారీ ర్యాలీలు అనుమతిస్తున్నారు. సామాజిక దూరం లేకుండా మార్కెట్లను నడుపుతున్నారు. ఆదివారం మాంసం కోసం ఎగబడుతున్నారు. అసలు ఆ ర్యాలీ ఫొటోలు దుమ్ము దుమారం రేపాయంటే ఇక అర్థం చేసుకోండి. వైఎస్ భారతి ఇచ్చిన విరాళాలతో పాటు ఇతర ప్రముఖులు ఇచ్చిన విరాళాలతో ఫ్లెక్సీలు తయారుచేయించి గొప్ప దాతలు అంటూ భారీ ర్యాలీతో ఊరంతా తిప్పారు జగన్ అనుచరులు. ఇది లాక్ డౌన్ నిబంధలకు విరుద్ధం. కానీ అది జగన్ రాజ్యం. 

ఇక నెల్లూరులో ప్రసన్న కుమార్ రెడ్డి 4000 మందిని ఒక చోెటుకు పిలిచి నిబంధనలు ఉల్లంఘించారు. దీంతో పోలీసులు కేసు పెట్టారు. నేను వారికి ఆహారం ఇవ్వడానికి పిలిచాను అంటున్నారు. సామి రంగా... నువ్వు ఆహారం ఇస్తున్నావా? వైరస్ పంచుతున్నావా.... అందరూ ఒక చోట చేరితే వైరస్ వస్తుందిరా అంటే వినరు. పైగా నాపైనే కేసు పెడతావా అంటూ మరో గుంపును వేసుకుని వచ్చి పోలీసు స్టేషను ముందు ధర్నాకు దిగారు. నా మీద కేసు ఎత్తేయకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా అంటూ పోలీసులను బెదిరించారు.

ఇక ఉత్తరాంధ్ర సామంత రాజు విజయసాయిరెడ్డి... సామాజిక దూరమా? అంటే ఏంటి అంటున్నారు. ఎవరో తయారుచేసిన ఫుడ్ ప్యాకెట్లపై తన పేరు ఫొటో వేసుకుని పంచిపెట్టారు. ఈ సందర్భంగా అందరూ గుమికూడారు. జై మోడీ అని 24 గంటలు అంటారు గానీ ఆయన పెట్టిన లాక్ డౌన్ మాత్రం లెక్కచేయరు సాయిరెడ్డి.