డేంజర్లో మాజీ మంత్రి నారాయణ ??

February 24, 2020
CTYPE html>
ఏంటి ఆయన కు ఏమైనా ప్రమాదం జరిగిందా? ఆరోగ్యం పాడైందా? అరెస్టు అయ్యారా??. అని టపటపా మీలో మీరే ప్రశ్నలు వేసుకుని సమాధానాల కోసం వెతుకుతున్నారేమో... అదేం లేదు. ఒక వైసీపీ ఎమ్మెల్యే మైండ్ గేమ్ ఆడబోయి కామెడీ పీస్ అయిపోయారు. మాజీ మంత్రి నారాయణ గురించి ఆయన ప్లే చేసిన స్క్రీన్ ప్లే అట్టర్ ఫ్లాప్ అయ్యి ఇపుడు ఆయన ట్రోల్ అవుతారు. ఇంతకీ ఆ వైసీపీ ఎమ్మెల్యే ఎవరు? ఏం మాట్లాడారో తెలుసుకుందాం.
అనకాపల్లి వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్ నాథ్ మీడియా ముందు మాట్లాడుతూ... ఈ ఉద్యమం చంద్రబాబు చెప్పినట్లు 5 కోట్ల మంది ప్రజలది కాదు అని, కేవలం చంద్రబాబుది అని చెప్పారు. మూడు సార్లు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబుకు అధికారికంగానే జీవితాంతం తినగలిగినంత సంపద ఉంది. వ్యాపారాలు ఉన్నాయి. ఆయనకు ఈ వయసులో ఉద్యమం చేసి బావుకోవాల్సిందేమీ లేదని అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ సందర్భంగా నారాయణను కేంద్రంగా చేసుకుని అమర్ నాథ్ పలు వ్యాఖ్యలు చేశారు.
అసలు నారాయణ ఏమయ్యారు?  ఎక్కడ దాక్కున్నారు?
రాజధాని రూపకల్పన కమిటీకి ఆయన ఛైర్మన్ కదా?
నారాయణను మీరు ఏదో చేశారు. ఆయన బయటకొచ్చి మాట్లాడితే ముప్పు అని ఆయనను టీడీపీ వాళ్లు ఏమైనా చేశారా? 
ఆయన 5 నిమిషాలు కూడా బయటకు వచ్చి మాట్లాడలేదంటే ఏదో ఉంది.
నారాయణ గారు మీకు ముప్పు ఉంది, మీ సెక్యూరిటీని జాగ్రత్తగా చూసుకోండి.
మీ చుట్టూతానే మీకు ముప్పు పొంచి ఉంది.
దేశాలు దాటి వెళ్లిపోండి. లేకపోతే ఏమైనా చేస్తారు.
లేదంటే... ‘తప్పు ఏదో జరిగిపోయింది.. చేయమన్నాడు కాబట్టి చేశాను, నాకు ఏ పాపం పుణ్యం తలియదు’ అని చెప్పి మీరు అప్రూవర్ గా మారి ప్రజలకు నిజాలు చెప్పండి. మీకు కావాల్సిన రక్షణ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది’ అని అమర్ నాథ్ వ్యాఖ్యానించారు. ఇదంతా చూస్తుంటే... వైకాపాలో భయం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఎలాగైనా తమ మీద రాజధాని విషయంలో బ్యాడ్ వెళ్లిపోయింది. దానిని టీడీపీ మీద తోయాలని పిచ్చి ప్రయత్నాలు ఇవి.
అమర్ నాథ్ గుర్తించాల్సిన విషయం ఏంటంటే... వైసీపీ అతివాదలు కొందరు మాజీ మంత్రి అనే మర్యాద పక్కనపెట్టండి. కనీసం మనిషి అనే మర్యాద కూడా ఇవ్వకుండా గొడ్డును బాదినట్టు బాదారు. ఇక ఆయన బయటకు ఏం వస్తారు ఈ వయసులో దెబ్బలు ఏం తింటారు. మనుషులను భయబ్రాంతులను చేయడంలో వైసీపీది అందెవేసిన చేయి. బహుశా ఆ కారణం వల్లనేమో... నారాయణ కనిపించడం లేదు. ఈరోజు నోటికి ఏదొస్తే అది మాట్లాడితే అది రేప్పొద్దున నారాయణ వచ్చి ఖండిస్తే పరువేం కాను అమర్ నాథ్ గారు. ఎలాగూ జరిగేది అదే. ఎంత సేపు తాత్కాలిక అబద్ధాలను విశ్వవ్యాపితం చేయడం తప్పితే ఇంకే ఆలోచన లేదేంటి మీకు. 
అమరావతిలో జరగడానికి ఏం ఉంది? అసలు అక్కడ జరగడానికి ఏం లేదు అనే కదా రాజధానిని తరలిస్తోంది. రైతులు పొలం ఇచ్చారు. పావు వంతు రైతులకు తిరిగి ఇవ్వాలి. మరో పావు వంతులో రోడ్లు, డ్రైనేజీలు వేయాలి. మిగతా భూమిలో  ప్రభుత్వం  కొంత అట్టిపెట్టుకుని, మరో పావు వంతును అమ్మడం ద్వారా అమరావతి కట్టడానికి అవసరమైన వేల కోట్లను సంపాదించి అద్భుతమైన నగరం నిర్మించవచ్చనేది ఆలోచన.  ఇందులో ఎవరు దాయడానికి ఏముంది. అయినా ప్రభుత్వం చేతుల్లో ఉన్నాపుడు విచారణ చేయాలి గాని ఆరోపణలు చేయడం ఏంటో వైసీపీ వాళ్లకే తెలియాలి.