​టీటీడీ ​ఇష్టారాజ్యంగా భూములమ్ముతానంటే కుదరదు - వైసీపీ ఎంపీ 

August 07, 2020

టీటీడీ భూముల అమ్మకం వ్యవహారం దేశ వ్యాప్తంగా పెద్ద గొడవకు కారణమవుతోంది. జగన్ రెడ్డి ఏరి కోరి తెచ్చి పెట్టిన సొంత కుటుంబీకుడు వైవీ సుబ్బారెడ్డి టీటీడీ ఛైర్మన్ గా చేస్తున్న రచ్చ... ప్రతి ఒక్కరి విమర్శలు ఎదుర్కొంటోంది. ఆ పార్టీ ఈ పార్టీ అని తేడా లేకుండా అన్ని పార్టీలు టీటీడీ ఛైర్మన్ సుబ్బారెడ్డి, టీటీడీ బోర్డులో ఉన్న జగన్ సన్నిహితుల నిర్ణయాన్ని తూర్పారబడుతున్నారు. 

అయితే.. వీరందరు విమర్శించడం ఒకెత్తు. వైసీపీ ఎంపీ విమర్శించడం ఒకెత్తు. వైసీపీ ఎంపీ రఘురామకృష్ణం రాజు టీటీడీ భూముల అమ్మకాన్ని తీవ్రంగా తప్పు పడుతున్నారు. ఇది భక్తుల మనోభావాలతో ఆడుకోవడమే అంటున్నారు. దీనిని ఎట్టి పరిస్థితుల్లోను క్షమించలేం అంటున్నారు. నా స్టాండ్ ఇదే... జగన్ చెప్పినా, ఇంకెవరు చెప్పినా... నేను టీటీడీ భూముల అమ్మకం నిర్ణయం అంగీకరించే ప్రసక్తే లేదన్నారు. 

తాను వెంకటేశ్వరస్వామి భక్తుడు. ఆ తర్వాతే ఇంకేమైనా. నేనే కాదు ఏ హిందువు ఈ నిర్ణయాన్ని హర్షించడు అని రఘురామ  కృష్ణం రాజు పేర్కొనడం గమనార్హం.