మా చిన్నకులంపై మీ రెడ్డి ప్రతాపం చూపొద్దు - వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

August 12, 2020

ఎంపీ పదవి, పార్లమెంటరీ కమిటీ పదవి పార్టీ మరియు జగన్ గారి బిక్ష అని నరసాపురం ఎమ్మెల్యే ప్రసాద రాజుతో తనపై విమర్శలు చేయించడంపై ఎంపీ రఘురామ రాజు తీవ్రంగా హర్టయ్యారు.

వైసీపీ తోడు ఉండొచ్చు గాని నన్ను బతిమాలితేనే పార్టీలోకి వచ్చానని, పార్టీ సహకారం ఉన్నా తనకున్న ప్రత్యేక పరపతితోనే పార్లమెంటు కమిటీ పదవి దక్కినట్లు రఘురామరాజు గట్టి కౌంటర్ ఇచ్చారు. ఇదంతా ఒకెత్తు. 

దీనిపై తాజాగా సుదీర్ఘంగా స్పందించిన రఘురామరాజు సుదర్ఘీరమైన ఒక వీడియోను విడుదల చేశారు. ముఖ్యంగా కులరాజకీయాలపై ప్రత్యేకంగా మాట్లాడారు.

వైసీపీలో ఒక సంప్రదాయం ఉందని... ఆ సంప్రదాయం ప్రకారం... ఏ కులం వారిని విమర్శించాలంటే ఆ కులం వారితోనే విమర్శలు చేయిస్తుంటారని రఘురామ రాజు బయటపెట్టారు. 

ఎస్సీని తిట్టాలంటే ఎస్సీ నేతతో, బీసీని తిట్టాలంటే బీసీ నేతతో విమర్శలు చేయించే సంప్రదాయాన్ని తనపై కూడా ప్రయోగించి మా కులానికి చెందిన ప్రసాదరాజుతో తనపై విమర్శలు చేయించడంపై రఘురామరాజు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా సున్నితంగా ఒక ఘాటు సూచన చేశారు. 

మాకున్న చిన్ని కులంలో, మీ పెద్ద కులం వారు చిచ్చు పెట్టొద్దని, మీరు రాజ్యాన్ని పరిపాలిస్తున్నారు. చల్లగా పరిపాలించుకోండి. మీకు సాధ్యమైనన్ని రోజులు పరిపాలించుకోండి.

అంతేగాని మా చిన్నికులంలో చిచ్చు పెట్టొద్దని మనసారా కోటరీ సభ్యులను కోరుకుంటూ, ముఖ్యమంత్రి గారిని ఉన్నత భావాలంతో ముందుకు వెళ్లకుండా ఇలాంటి ‘‘సం‘కుల‘‘ భావాలు ఆయనకు అటించొద్దని కోటరీ సభ్యులకు విజ్జప్తి చేస్తున్నాను అన్నారు.

నా పై మాట్లాడిన ప్రసాదరాజు గారు మరింత ఎదగాలని, ఆయనకు మంత్రి పదవి కూడా రావాలని మనసారా కోరుకుంటున్నట్లు చెప్పారు. 

వైసీపీలో రెబల్ స్టార్ గా మీడియా ముద్రేసినా ఆయన మాత్రం... నాకు ముఖ్యమంత్రిపై ఇష్టం ఉంది కాబట్టే ప్రజల్లో చెడ్డ పేరు రాకూడదని ఇవన్నీ ఆయన దృష్టికి తెచ్చానని, అపాయింట్మెంట్ దక్కకుండా కోటరీ సభ్యులు చేయడం వల్లనే తాను మీడియా ముఖంగా చెప్పి మా ముఖ్యమంత్రి మేలు చేయాలనుకున్నట్లు రఘురామరాజు అన్నారు.

 

చివరి నిమిషం వీడియో తప్పకుండా చూడండి.