జ‌గ‌న్ వైఖ‌రితో త‌ల‌దించుకుంటున్న వైసీపీ ఎంపీలు?

April 04, 2020

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ప‌రిణామాల‌పై బీజేపీ ఎంపీ సుజనా చౌదరి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన సుజ‌నా ఏపీలోని ప‌రిణామాల‌పై ఆయ‌న స్పందించారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న మహిళలపై దాడి‌ చేసి,  అరెస్టు చేయడం అన్యాయమ‌ని పేర్కొన్నారు. ఒంగోలులో మహిళలపై మగ పోలీసులు దాడి‌చేయడం కలచి వేసిందని పేర్కొన్నారు. ఇటువంటివి ఆపలేకపోతే మనం పదవుల్లో ఉండటం ఎందుకు అని సుజ‌నా ప్ర‌శ్నించారు. మనం ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నామా... ఆఫ్ఘనిస్థాన్‌లో ఉన్నామా? అని సుజ‌నా వ్యాఖ్యానించారు.

కుల, మతాలకు అతీతంగా అందరూ ఉద్యమం చేసి రాష్ట్రంలోని దారుణాలు ఆపాలని సుజ‌నా చౌద‌రి పేర్కొన్నారు. `ఆరు నెలల్లో ఆడపడుచుల‌ విశ్వాసం ప్ర‌భుత్వం కోల్పోయింది. ఇటువంటి ప్రభుత్వానికి‌ భవిష్యత్తులో మనుగడ లేదు. అవసరం లేకున్నా 144 సెక్షన్ పెడుతున్నారు. ఏ నిబంధనలు ప్రకారం అర్ధరాత్రి పోలీసులు ఇళ్లకు వెళుతున్నారు? అమ్మవారికి మొక్కులు కూడా చెల్లించుకోకుండా అడ్డుకున్నారు. కులం, వివరాల కోసం ఇంత ఇబ్బందులు పెడతారా? వైసీపీ ర్యాలీలకు ఎలా అనుమతి ఇస్తున్నారు? రాష్ట్రంలో ఇంత జరుగుతుంటే డీజీపీ ఏం‌ చేస్తున్నారు?  రాష్ట్రంలోని ప‌రిస్థితులు చూసి వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యేలు కూడా మాట్లాడలేక‌ సిగ్గుతో తలదించుకుంటున్నారు` అని వ్యాఖ్యానించారు. కులాల మధ్య చిచ్చు పెట్టి పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు అని ఆరోపించారు.

ప‌రిపాల‌న వికేంద్రీక‌ర‌ణ విష‌యంలో, భిన్నాభిప్రాయాలు నుంచి ఏకాభిప్రాయం తీసుకురావాలని సుజ‌నా చౌద‌రి కోరారు. ``పాలన వికేంద్రీకరణ ద్వారా అభివృద్ధి సాధ్యం కాదు. 13 జిల్లాల నుంచి ప్రజలు రోడ్లపైకి వచ్చి ఉద్యమించాలి. మా పార్టీ సిద్దాంతం ఏదైనా... ప్రజలకు జరుగుతున్న అన్యాయంపై పోరాటం చేస్తాను. కేంద్రం దృష్టికి తీసుకెళ్లి... అమరావతి ఇక్క‌డే ఉండేలా కృషి‌ చేస్తాను. తన, మన, కుల, మత, ప్రాంతాలకు‌ అతీతంగా పోరాటం చేయాల్సిన సమయం వచ్చింది. ఇది సరి‌చేయలేకపోతే నా పదవులు నాకు అనవసరం. పార్టీ సహకారం లేకున్నా... వ్యక్తిగతంగా అయినా పోరాడతా. రాష్ట్రంలో నేరాలు, ఘోరాలు పెరిగిపోయాయి. ఇవన్నీ‌ చూస్తూ .. మౌనంగా ఉండలేను.`` అని అన్నారు. కేంద్రం కూడా పరిస్థితి ఎప్పటికప్పుడు తెలుసుకుంటుందని పేర్కొన్నారు. డీజీపీ కూడా రాజ్యాంగ బద్దంగా వ్యవహరించాలని, లేకుంటే..‌ ఆయన ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు అని హెచ్చ‌రించారు. 

Read Also

50 వేల ఓట్ల కోసం జనాలకు టోపీ పెట్టిన జగన్
జగన్ ఎంత ’పవర్ ఫుల్‘ అంటే...
​అమరావతి ఉద్యమంపై దొంగ దెబ్బ​