వైసీపీ సూపర్ ప్లాన్.... కానీ అట్టర్ ప్లాప్

August 13, 2020

ఏపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఏం మాట్లాడుతున్నారో వారికే అర్థం కాని పరిస్థితి. అవగాహన లేదు. బాధ్యత అంతకంటే లేదు. జనాలు హెచ్చరించినా, తిట్టినా మారకుండా కరోనా సూపర్ స్ప్రెడర్లను సృష్టించే విధంగా ప్రవర్తించిన వైసీపీ ఎమ్మెల్యేలకు చివరకు కోర్టు చెబితే గాని ఏమీ ఎక్కదు. ఈరోజు కోర్టు ఉదయాన్నే రంగులపై, వైసీపీ ఎమ్మెల్యేలపై చీవాట్లు పెట్టేసరికి... దానిని డైవర్ట్ చేయడానికి వైసీపీలో ఒక్కొక్కరు ఒక్కో టాపిక్ ఎంచుకున్నారు. దాంతో పాటు టీచర్లను వైన్ షాపుల వద్ద నిలబెట్టడం ఇంకా పెద్ద ట్రెండ్ అయ్యింది. పరువును దక్కించుకోవడానికి ఏం చేయాలో తెలియని వైసీపీ ప్రజలను వేరే టాపిక్ ల మీదకు మళ్లించడానికి ప్లాన్ వేసింది. కానీ దీనిని సోషల్ మీడియా పట్టేసింది. వారి ప్లాన్ ను పటాపంచలు చేసింది.

విజయసాయిరెడ్డి హెరిటేజ్ లో కరోనా (ఇది నిజం కాదని తెలంగాణ ప్రభుత్వం తేల్చింది) అంశంపై ట్వీట్లు చేశారు. బండ్ల గణేష్ లోకేష్... ఆయన రాజకీయ గతం, వర్తమానం, భవిష్యత్తుపై ట్వీట్లు వేశాడు. పేర్ని నాని చంద్రబాబే డబ్బులు ఇచ్చి, మాస్కులు పెట్టుకోకుండా వైన్ షాపులకు వెళ్లండని చెప్పి పంపాడని అన్నాడు. సాయిరెడ్డి విషయం కొత్తదేమీ కాదు. అతను బాబు ను తిట్టడం ద్వారానే ఫేమస్ అయ్యాడు. జగన్ వ్యక్తిత్వం జనం గుర్తించాలంటే... జగన్ కంటే బాబు దుర్మార్గుడు అని చూపాలి. అలా చూపడానికి ఏం లేవు. అందుకే రోజుకో అబద్ధం అల్లేస్తాడు. హెరిటేజ్ లో కరోనాలాగా. తెలంగాణ గవర్నమెంటు హెరిటేజ్ లో ఎవరికీ కరోనా రాలేదని చెప్పినా మళ్లీ అదే అబద్ధం చెబుతాడు. 

ఇక తన వంగమాగదుల్లో ఒకరైన బండ్ల గణేష్ ని లోకేష్ మీదకు వదిలారు. సంబంధం లేని సమయంలో సంబంధం లేని టాపిక్ ను మళ్లించడం ద్వారా టీడీపీ కార్యకర్తలను గవర్నమెంటు మీద కామెంట్లు చేయకుండా అలా మళ్లించే ప్రయత్నం చేశారు. ఈ విషయాన్ని నెటిజన్లు, సోషల్ మీడియా గమనించింది. ముందు మద్యం క్యూలకు, ధరలకు, అక్కడ టీచర్లను నిలబెట్టడానికి చెంపేసుకోండంటూ జగన్ కి మొట్టికాయలు వేస్తూనే ఉంది. ఇక పేర్ని నాని చేసిన కామెంట్ కి అయితే జనం మామూలు కౌంటర్ వేయలేదు... నీకు మతిపోయిందా... దేశంలో మద్యం ఓపెన్ చేసిన అన్ని రాష్ట్రాల్లో ఇదే రష్ ఉంది. కళ్ల కనపడలేదా.... మరి ఆ రాష్ట్రాలకు కూడా చంద్రబాబే తెలుగుదేశం కార్యకర్తలను పంపాడా... మాట్లాడితే మీనింగుండాలి అంటూ జనం ఉతికారేశారు. దీంతో గంటలోనే పేర్ని నాని చంద్రబాబుపై వేసిన నిందలను పటాపంచలు చేశారు నెటిజన్లు. 

చూస్తుంటే... వైసీపీ ప్రభుత్వం వ్యవహారం ఎలా ఉందంటే... మూడు తప్పులు చేసి ఆరు దెబ్బలు తింటోంది. ఇప్పటికి అయినా మేలుకోకపోతే పరిస్థితి దారుణంగా మారే అవకాశం ఉంది. మళ్లీ మళ్లీ ట్రాప్ లో దించుతాం అంటే జనం కనిపెట్టకుండా ఉంటారా? అయినా ఏడాది పాలన చూశాక... ఇంకా జగన్ పై నమ్మకం ఎక్కడి నుంచి వస్తుంది?