బెలూన్లు కట్టి కరోనా సంబరాలు చేసిన వైసీపీ

May 31, 2020

ఇది విలయం

ప్రకృతి విపత్తు.

ప్రపంచ దేశాలు కన్నీరు పెడుతున్నాయి. 

కానీ జగన్ రెడ్డి ఆధ్వర్యంలో ఏపీ అధికారులు కరోనా సంబరాలు చేసుకుంటున్నారు. హైపో క్లోరైడ్ స్ప్రే ఎంట్రన్స్ ఏర్పాటుచేసి దాని ప్రారంభోత్సవానికి డబ్బులు ఖర్చుపెట్టి అలంకరణ చేసి బెలూన్లు కట్టారు. ఆ ఫొటోలు షేర్ చేసుకుంటూ సంబరాలు చేసుకున్నారు. ప్రతి రాష్ట్రంలో ఇవి ఏర్పాటుచేశారు. ఏపీలో చాలా ఆలస్యంగా ఏర్పాటుచేయడమే ప్రభుత్వ వైఫల్యం. ఆ అవమాన భారం అధికారుల్లో లేకపోగా పార్టీ బ్యానర్లతో విపరీంగా ప్రచారం చేసుకుంటున్నారు. విపత్తు నిధులతో పార్టీ ప్రచారం చేసుకోవడం ఘోరం. వాస్తవానికి ఆ ప్రాంతంలో కరోనా జాగ్రత్తలు, హెల్ప్ లైన్ నెంబర్లు ముద్రిస్తే ప్రజలకు కాస్త ఉపయోగం ఉండేది.

దీనిపై తెలుగుదేశం పార్టీ తీవ్రంగా స్పందించింది. ’’కొవ్వూరు మునిసిపాలిటీవాళ్ళు ప్రజలకు కరోనా మీద అవగాహన కల్పించాలనుకున్నారా? లేక వైసీపీకి ప్రచారం చేయాలనుకున్నారా? కరోనా డిస్ఇన్ఫెక్షన్ టన్నెల్ మీద ప్రజా ప్రతినిధుల ఫోటోలు, వైసీపీ రంగులు వాడటం ఏంటి? రాష్ట్రంలో ఎన్నికల నియమావళి ఉందని తెలీదా?’’ అంటూ అధికారుల తీరును తప్పు పట్టింది తెలుగుదేశం.