వైసీపీ నేత మోసం చేశారంటూ దళిత నాయకురాలి ఆత్మహత్యాయత్నం

August 14, 2020

​అధికారం అండ చూసుకుని కొందరు వైసీపీ కార్యకర్తలు, నేతలు వ్యవహరిస్తున్న తీరు వివాదాస్పదం అవుతోంది.

ఇంతకాలం ప్రతిపక్షాల నుంచే ఈ కంప్లయింట్లు వచ్చేవి. కానీ తాజాగా ​ఆ పార్టీలోని బలహీన వర్గాల నుంచి కూడా కంప్లయింట్లు వస్తున్నాయి. 

నామినేటెడ్‌ పోస్ట్‌ ఇప్పిస్తానని తమ పార్టీ ఎంపీ భర్త తనను మోసం చేశారంటూ వైసీపీ రాష్ట్ర దళిత మహిళా నేత ఒకరు మీడియా ముందే పురుగుల మందు తాగి ఆత్మహత్య ప్రయత్నం చేసింది.

ఈ ఘటనతో వైసీపీ నేతల అహంకార పూరిత విధానాలు బట్టబయలైనట్లు అయ్యింది. 

ఆమె విలేకరుల సమావేశం పెడితే ... ఆవేదన చెప్పడానికి అని మీడియా అనుకుంది.
కానీ సమావేశంలోనే ఆమె పురుగుల మందు తాగడంతో ఖంగుతిన్న విలేకరులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.
అనంతరం పోలీసుల సాయంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. దీంతో ఆమెకు ప్రాణాపాయం తప్పింది. సోమవారం విజయవాడ గాంధీనగర్‌ ప్రెస్‌క్లబ్‌లో ఈ ఘటన జరిగింది. 
 
కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లికి చెందిన బొల్లిపల్లి శాంతకుమార్‌ అలియాస్‌ జోని కుమారి జిల్లా విజిలెన్స్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీలో సభ్యురాలు.
ఆమె  వైసీపీ మాల మహానాడు రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు.
వైసీపీ పార్టీలో కీలక నేతనే ఇంత మోసం చేస్తే ఇక ప్రతిపక్షాలు, సామాన్యుల పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు.  
‘పార్టీలో కొందరు నన్ను మోసం చేశారు. ఈ విషయాన్ని ఎంపీ విజయసాయిరెడ్డి దృష్టికి తీసుకెళ్లాను. కానీ ఆయన పట్టించుకోలేదు అన్నారు. 
 
నా బాధను సీఎంకు తెలియజేయడానికే ఈ సమావేశం పెట్టినట్లు పేర్కొన్నారు.  
చావుతో అయినా నా బిడ్డలకు పరిష్కారం దొరుకుతుందని జగనన్నకు చెప్పడానికే ఈ పనిచేసినట్లు పేర్కంది. 
రాష్ట్ర  దళితుల సోదరులు నా కుటుంబానికి అండగా నిలవాలని  ఆమె మీడియా ముందు చెప్పారు.