బాబును ఇరికించ‌బోయి అడ్డంగా బుక్క‌యిన వైసీపీ

June 01, 2020

అమ‌రావ‌తి విష‌యంలో ఏపీ ప్ర‌తిప‌క్ష నేత‌, టీడీపీ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబు నాయుడు ప్ర‌జ‌ల ప‌క్షాన గ‌లం వినిపిస్తున్న సంగ‌తి తెలిసిందే. మూడు రాజ‌ధానుల ఏర్పాటు పేరుతో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ స‌ర్కారు వివాదాస్ప‌ద నిర్ణ‌యం తీసుకున్న నాటి నుంచి చంద్ర‌బాబు రాజ‌ధాని రైతుల‌కు అండ‌గా ఉంటూ వ‌స్తున్నారు. తాజాగా, సంక్రాంతి పండుగ‌ను కూడా జ‌రుపుకోకుండా...కుటుంబ స‌మేతంగా రైతుల ఆందోళ‌న‌ల్లో పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు. అయితే, ఈ చంద్ర‌బాబు రైతుల కోసం చేసిన వ్యాఖ్య‌ల‌ను వైసీపీ ఎద్దేవా చేసింది. చిత్రంగా...అదే అంశంతో సెల్ఫ్‌గోల్ చేసుకుంది.
సంక్రాంతి పండుగ సంద‌ర్భంగా మంద‌డంలో, తుళ్లూరులో రైతుల దీక్షా శిబిరం వద్దకు చంద్రబాబు, నారా-నందమూరి కుటుంబ సభ్యులు చేరుకొని అక్కడ దీక్ష చేస్తున్న రైతులకు సంఘీభావం తెలిపారు. రైతుల సమ్మెకు మద్ద‌తు తెలిపిన నారా చంద్రబాబు నాయుడు ఈ సారి తాను సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పబోనని, ఈ ఏడాది కష్టాల సంక్రాంతి జరుపుకుంటున్నామని అన్నారు. రైతులకు మద్దతు ఇచ్చేందుకే తమ కుటుంబం ఈ రోజు మందడానికి, తూళ్లూరుకు వచ్చామ‌ని చంద్రబాబు చెప్పారు.
దమ్ముంటే అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లండని వైసీపీకి చంద్రబాబు సవాల్ విసిరారు. అలా ఎన్నికలకి వెళ్లి అలా ఎన్నికల్లో గెలిచాకే ఈ తరహా నిర్ణయాలు తీసుకోండని బాబు సూచించారు. అలాగే ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయాలకు దూరంగా ఉంటానన్న చంద్రబాబు ఎన్నికలు పెట్టడం ఇష్టం లేకుంటే రాజధాని తరలింపుపై రెఫరెండం పెట్టమని డిమాండ్ చేశారు.
ఏపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర విమర్శలు గుప్పించిన నేప‌థ్యంలో వైసీపీ సోష‌ల్ మీడియాలో ఓ సెటైరిక‌ల్ పోస్ట్‌ను పెట్టింది. ``తెలంగాణ ఉద్య‌మంలో భాగంగా గ‌తంలో టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామా చేశారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా కోసం వైఎస్ జ‌గ‌న్ సార‌థ్యంలోని ఎంపీలు రాజీనామా చేశారు. ఇప్పుడు అమ‌రావ‌తి కోసం గ‌లం విప్పుతున్న చంద్ర‌బాబు అందుకోసం త‌న పార్టీ ప్ర‌జాప్ర‌తినిధుల‌తో రాజీనామా చేయ‌వ‌చ్చు క‌దా?`` అనేది ఆ పోస్ట్ సారాంశం. అయితే, దీనికి స్పంద‌న‌గా వైసీపీకి ఊహించ‌ని రిప్లైలు వ‌చ్చాయి. `అందుకే అయ్యా ఇప్పుడు ysrcp 22 మంది mpలను రాజీనామా చేసి ప్రత్యేక హోదా తెచ్చేయనండి` అంటూ ఓ నెటిజ‌న్ వైసీపీకి ఘాటు రిప్లై ఇచ్చాడు. మ‌రో నెటిజ‌న్ ఏపీలోని ప‌రిస్థితుల‌ను ప్ర‌స్తావించాడు. `వాళ్ళు తెలంగాణ సాధించే వరకు పోరాడారు, మరీ మనం ప్రత్యేక హోదా సాధించేవరకు పోరాడ‌వ‌లసిన అవసరం లేదా ఆ దమ్ము లేదా ఎవరికి` అంటూ ఓ నెటిజ‌న్ నిల‌దీశాడు.

అంటే రాజధాని రెఫరెండం కోసం చంద్రబాబు ఎమ్మెల్యేలు

ప్రత్యేక హోదా కోసం జగన్ ఎంపీలు రాజీనామాలు చేస్తారన్నమాట?