రఘురాముడి వ్యవహారం... అనుకున్నదే జరిగిందా?

August 10, 2020

ఎట్టకేలకు వైసీపీ అధిష్టానం ధైర్యం చేసింది. బీజేపీ పెద్దలతో సాన్నిహిత్యం కలిగిన వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు పార్టీ ధిక్కరణ నోటీసులు ఇచ్చారు. వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి పేరు మీద ఈ నోటీసులు ఇచ్చారు.

ఏపీ ప్రభుత్వం చేస్తున్న కొన్ని తప్పులపై ప్రజాభిప్రాయం మేరకు ఎంపీ రఘురామ కృష్ణం రాజు తన అభిప్రాయాలు చెప్పారు. టీడీపీ భూముల అమ్మకం, ఇసుక కొరత వంటి వాటిపై ఆయన ప్రభుత్వాన్ని అలర్ట్ చేశారు.

అయితే, సొంత ఎంపీ చెప్పినవి నిజాలే అయినా కూడా వైసీపీ ఎంపీయే చెబితే పార్టీకి డామేజ్ అని జగన్ భావించారు. జగన్ కు ప్రైవేటుగా చెబుదాం అనుకున్నాను. ఆయన అపాయింట్ మెంట్ దొరకలేదు. దీంతో ఆయనకు చేరాలని మీడియా కు చెప్పాను అన్నారు రఘురామరాజు.

వెంటనే అపుడు జగన్ అతన్ని పిలిపించి ఉంటే సమస్య తీరిపోయేది. కానీ తెగేదాకా లాగారు. పార్టీలో ఉంటే ఉండు పోతే పో అంటూ ఎమ్మెల్యేలు మంత్రుల చేత తిట్టించారు. దీంతో రఘురామ రాజుకు కోపమొచ్చింది. నేను మంచి చెబితే నా మీద దాడి చేస్తారా అని విరుచుకుపడ్డారు.

గోదావరి జిల్లా ఎమ్మెల్యేలు చేస్తున్న దందాలు అన్నిటినీ రఘురామరాజు బయటపెట్టారు. దీంతో పార్టీ పరువు పోయింది. ఇంతకాలం సుద్దులు చెప్పి వైసీపీ ప్రభుత్వం ఇంత అవినీతి చేస్తుందా...అదే పార్టీ ఎంపీ చెప్పారంటే నిజం కాక మరేంటని జనం చర్చించుకున్నారు.

అప్పటిేక రఘురామరాజును పిలిపించకుండా ఎమ్మెల్యేలు ఆయనపై మళ్లీ దాడిచేశారు. వారి అనుచరులు దిష్టిబొమ్మలు తగలబెట్టారు. రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దీంతో రఘురామకృష్నం రాజు ఈ వ్యవహారాలపై ఎస్సైలకు తర్వాత ఎస్పీకి, తర్వాత లోక్ సభ స్పీకరుకు ఫిర్యాదు చేశారు. 

దీంతో ఇక అతనితో సంబంధాలు తెంచుకోవడానికి పార్టీ సిద్ధమైంది. వారంలోపు వివరణ ఇవ్వాలని నోటీసులు ఇచ్చింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు ఎందుకు పాల్పడుతున్నారో చెప్పాలని గడువిచ్చింది. దీనిపై ఇంకా రఘురామకృష్ణం రాజు స్పందించలేదు.