బాబు ఘనత నీ నోటితో చెప్పావు జగన్

July 15, 2020

అసత్యాల జగన్ ప్రపంచమంతా అసత్యాలతోనే జీవిస్తోందనే గుడ్డి నమ్మకంలో ఉంటారని... తనపై కేసులు పెట్టి జైలుకు పంపించారు కాబట్టి తాను కూడా అందరినీ జైలుకు పంపాలని కోరుకుంటున్నారని లోకేష్ విమర్శించారు. నువ్వు తప్పులు చేశావు కాబట్టి జైలుకు వెళ్లావు. మేము తప్పులు చేయలేదు కాబట్టి మమ్మల్ని ఏమీ చేయలేక గింజుకుంటున్నావు అన్నట్టు లోకేష్ విమర్శించారు.

ఎన్నికల ముందు ప్రతి సభలో చంద్రబాబు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని జగన్ అబ్దాలు చెప్పుకుంటూ వచ్చారు. చివరకు పదవి చేపట్టాక అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు 9 లక్షలకు పైగా ఉద్యోగాలు ఇచ్చారని అసెంబ్లీలో ఒప్పుకున్నారు. తెలుగుదేశంపై వైసీపీ చెప్పినవి అన్నీ అబద్ధాలు అని తన నోటితోనే ఒప్పుకోవాల్సి రావడం... కాలం చేసిన మాయ.

16 నెలలు జైల్లో ఉన్న వ్యక్తి అవినీతి గురించి ప్రవచనాలు చెబుతుంటే జనం నవ్వుకుంటున్నారని అన్నారు లోకేష్. సాక్ష్యాలు ఉన్న విషయాల్లో కూడా అబద్ధాలు చెప్పగలిగిన ఘనత ఒక్క వైసీపీకే ఉంటుందని... ఇన్ ఫ్రా కంపెనీలు నడిపేది జగన్. చంద్రబాబు కు ఒక్క ఇన్ ఫ్రా కంపెనీ లేదు. కానీ వాటి సోదాల్లో డబ్బు దొరికితే టీడీపీ మీద నిందలు వేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. 40 చోట్ల సోదాలు చేసి 85 లక్షలు పట్టుకున్నాం అని ఐటీ శాఖ చెబుతుంటే... 2 వేల కోట్లు కేవలం చంద్రబాబువి దొరికినట్లు పనికిమాలిన అబద్ధపు ప్రచారం చేస్తూ శునకానందం పొందుతున్నారని లోకేష్ విమర్శించారు. 

ఇప్పటికే మీరు చెప్పేవన్నీ అబద్ధాలు అని మెల్లగా అందరికీ అర్థమవుతుంది... రావాలి జగన్ అన్న వాళ్లు పోవాలి జగన్ అంటున్నారు. ఇప్పటికైనా మేల్కొని ఈ అబద్ధాలు మానక పోతే జనమే మెడపట్టటి గెంటేస్తారు మరి.

Read Also

అయ్యోరాామా... వైసీపీ కర్మరా మామా
'యథారాజా.. తథా నాయకులు'.
స్ఫూర్తిదాయకంగా అయ్యన్నపాత్రుడి ప్రసంగం