యుద్ధం స్టేట్‌మెంట్ రాద్దాంతం...

May 25, 2020

దేశంలో ఎలాంటి సంఘ‌ట‌న చోటుచేసుకున్నా అది త‌న వ‌ల్లే అయింద‌ని, మేము ముందే ఊహించాము అని రాజ‌కీయ నాయ‌కులు చెబుతూ ఉంటారు. నేత‌ల మాట‌లపై సోష‌ల్ మీడియాలో జోకులు కూడా పేలుతున్నాయి. దేశ స‌రిహ‌ద్దుల వ‌ద్ద నెల‌కొన్న యుద్ద ప‌రిస్థితులపై కొంత మంది నేత‌లు ప్ర‌చారాస్త్రాలుగా మ‌లుచుకుంటున్నారు. ఓ నేత  స‌ర్జిక‌ల్ స్ర్టైక్  వ‌ల్ల తాము అత్య‌ధిక పార్ల‌మెంట్ సీట్ల‌ను గెలుచుకుంటామ‌ని ప్ర‌క‌టించారు. కాంగ్రెస్ నేత వ్యాఖ్యానాల‌ను  వివాదంగా మార్చి త‌మ‌కు అనుకూలంగా ప్ర‌చారం చేసుకుంటున్నారు. తాజా యుద్దం  పై ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇచ్చిన స్టేట్‌మెంట్ వివాదంగా మారింది. ‘ఎన్నికల ముందు యుద్ధం వస్తుందని నాకు రెండేళ్ల కిందటే చెప్పారు’ అని చేసిన వ్యాఖ్యలపై జనసేన అధిపతి పవన్‌ కల్యాణ్‌ వివరణ ఇచ్చారు. ఇది తనకు ఎవరో చెప్పింది కాదని... ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, వార్తా చానళ్లకు తెలిసిందే తాను చెప్పానని వివరించారు. ఈ క్రమంలో తాజాగా విద్యార్థులు, యువతతో మాట్లాడుతూ పవన్‌ దీనిపై వివరణ ఇచ్చారు. ‘‘యుద్ధం వస్తుందని నాకేం తెలుసు! రెండేళ్ల ముందే నేనెలా చెప్పగలను? పాకిస్థాన్‌ వాళ్లు మాట్లాడుకునేది వింటానా ఏంటి? లేమ్యాన్‌ బ్రదర్స్‌ సంస్థ ఆర్థికంగా కుప్పకూలుతుందని ముందునుంచే అంచనావేసి చెప్పేవారు. అలాగే యుద్ధం వస్తుందని ఊహించేందుకు కొందరి వ్యాఖ్యలే కారణం. నేనూ వాటిని దృష్టిలో ఉంచుకుని చెప్పాను’’ అని పవన్‌ వివరించారు. కాని ప‌వ‌న్ వ్య‌ఖ్యాల‌ను ప్ర‌తీ మీటింగ్‌లో ప్ర‌స్తావిస్తూ చంద్ర‌బాబునాయుడు వ‌ర్గం త‌మ ప్ర‌చార అస్త్రంగా మార్చుకుంది. ఇది జ‌న‌సేన‌కు మింగుడు ప‌డ‌టం లేదు. దీంతో బాబు పై ఎదురు దాడి చేయ‌డం మొద‌లు పెట్టారు. సోష‌ల్ మీడియా వేధిక‌గా బాబుకు ఓ ప్ర‌శ్న‌వ‌ళిని విడుద‌ల చేసారు. నోట్ల రద్దు స‌ల‌హా ఇచ్చింది తానే అని చంద్ర‌బాబు గ‌తంలో ప్ర‌క‌టించుకున్నాడు. ఇప్పుడు బీజేపీని విమ‌ర్శించ‌డ‌మే కాకుండా నోట్ల ర‌ద్దు కార‌ణంగా దేశ ఆర్ధిక ప‌రిస్థితి చిన్న‌బిన్నం అయింద‌ని బాబు యూ ట‌ర్న్ తీసుకున్నారంటూ జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు కారాలు మిరియాలు నూరుతున్నారు.