వైవీ సుబ్బారెడ్డి కవరింగ్ చేస్తూ దొరికేశాడు

August 04, 2020

దేశ వ్యాప్తంగా ఆలయాలన్నిటినీ మూసేశారు. ఇతర మతాల ప్రార్థన మందిరాలు కూడా మూసేశారు. లాక్ డౌన్ నిబంధనల ప్రకారం అత్యవసరాలకు తప్ప ఎవరినీ బయట అడుగుపెట్టనీయడం లేదు. కానీ ఏపీలో వైసీపీ నేతలు ఎంత అడ్డదిడ్డంగా నిబంధనలు కాలరాస్తున్నారో చూస్తూనే ఉన్నాం. జాతీయ మీడియాలో వైసీపీ నేతల లాక్ డౌన్ ఉల్లంఘనల గురించి పుంఖానుపుంఖాలుగా వార్తలు వచ్చాయి. అయినా మారడం లేదు. ఏకంగా భారీ సభలు పెట్టి జనాల్ని తరలిస్తున్నారు.  ప్రతి జిల్లాలో వైసీపీ నాయకులు ఇలాగే చేశారు. తాజాగా పరమ పవిత్రమైన టీటీడీ ఛైర్మన్ హోదాలో ఉన్న వైవీ సుబ్బారెడ్డి నేనేం తక్కువ తిన్నాను... అంటూ తాను కూడా లాక్ డౌన్ ను ఉల్లంఘించారు. 

దేశ వ్యాప్తంగా ఆలయాలు భక్తులకు పూర్తిగా మూసివేసిన నేపథ్యంలో సుబ్బారెడ్డి సకుటుంబ సపరివార సమేతంగా తిరుమల శ్రీనివాసుడిని దర్శించుకున్నారు. దీనిపై పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. జాతీయ మీడియా సుబ్బారెడ్డిని కడిగిపారేసింది. వీవీఐపీలకు లాక్ డౌన్ వర్తించదా? భక్తులకు గుళ్లు మూసేసి నేతలు దర్శనాలు చేసుకుంటారా? ఇదేం విచిత్రం అంటూ ఇండియా టుడే ఛానెల్లో వీడియో సహితంగా ప్రసారం చేశారు. ఎక్కడా సామాజిక దూరం కూడా పాటించలేదు. ఎవరికీ మాస్కులు లేవు. ప్రజలకు వీళ్లు ఏం సందేశం ఇస్తున్నారు అంటూ మీడియా ప్రశ్నించింది. పైగా వీడియోలు తీసుకుని సోషల్ మీడియాలో పెట్టడం ప్రజలకు ఇంకా మండేలా చేసింది. దీనిపై లోకేష్ పెద్దలకు దర్శనాలుంటాయా? అని ప్రశ్నింగా... తిరిగి లోకేష్ కే వార్నింగ్ ఇచ్చారు సుబ్బారెడ్డి. వీడియో సాక్ష్యం కళ్ల ముందు కనిపిస్తుంటే అసత్యాలు చెబితే అరెస్టు చేయిస్తానంటే వార్నింగ్ ఇచ్చారంటే వైసీపీ నాయకులు ఏ స్థాయిలో తెగించారో స్పష్టంగా అర్థమవుతుంది.

ఇక దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చేటప్పటికి కవర్ చేసుకోవడానికి ప్రయత్నించిన సుబ్బారెడ్డి... నెలకు రెండు సార్లు శుక్రవారం పూట టీటీడీ ఛైర్మన్ హోదాలో ఆలయంలో జరిగే ’అభిషేక‘ కార్యక్రమాల్లో పాల్గొంటానని.. నిన్న యాదృశ్చికంగా నా పుట్టిన రోజు అయ్యిందని వివరించే ప్రయత్నం చేశారు. ఇక్కడే సుబ్బారెడ్డి దొరికిపోయారు.  వీడియోలో ఎండ వచ్చిన తర్వాత అంటే 7 గంటల తర్వాత దర్శనం చేసుకున్నట్టు అర్థమవుతుంది. వాస్తవానికి 7 గంటల తర్వాత తిరుమలలో ఏ అభిషేకాలు జరగవు.  ఇదే నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. దీనికి సుబ్బారెడ్డి దగ్గర సమాధానం లేదు.

ఇంకో విషయం ఏంటంటే... లాక్ డౌన్లో ఆనవాయితీలతో సహా అన్నీ రద్దు చేశారు. 128 సంవత్సరాల తర్వాత గుడి మూశారు. గుడిమూయడం ఆనవాయితీ కాదు. అయినా మూసేశారు అంటే అన్నీ రద్దయినట్టే కదా. మరి ఈ మాత్రం కూడా ఆలోచించకుండా కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు సుబ్బారెడ్డి. 

చిత్తూరు రెడ్ జోన్లో ఉంది. 70 సంవత్సరాలు దాటిన వ్యక్తిని ఇలా ప్రయాణంలో తీసుకెళ్లడానికి ఏ నిబంధన అనుమతించింది? పోనీ సుబ్బారెడ్డి మాటలే నిజమనుకున్నా ఛైర్మన్ భార్యకు ఆనవాయితీ పూజల్లో అనుమతి ఉంటుంది గాని తల్లికి పిల్లలకు ఉండదనే విషయం సుబ్బారెడ్డి ఎపుడు తెలుసుకుంటారు?