వైవీ సుబ్బారెడ్డి భలే దొరికాడే !!

May 25, 2020

ఏపీ ముఖ్య‌మంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డికి, తెలుగుదేశం పార్టీ ర‌థ‌సార‌థి చంద్ర‌బాబు నాయుడుకు మ‌ధ్య ఉన్న రాజ‌కీయ వైరుధ్యం గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించ‌న‌వ‌స‌రం లేదు, రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థులు అనే కంటే శ‌త్రువులుగా కూడా కొన్ని సంద‌ర్భాల్లో వ్య‌వ‌హ‌రించిన ఉదంతాల‌ను ప‌లువురు ప్ర‌స్తావిస్తుంటుంటారు. అయితే, తాజాగా ఆస‌క్తిక‌ర‌మైన పరిణామం చోటుచేసుకుంది. ఏపీ సీఎం జ‌గ‌న్ కుటుంబ స‌భ్య‌డి ప్ర‌మాణ స్వీకారంలో చంద్ర‌బాబు కుటుంబానికి చెందిన కంపెనీ ప్రొడ‌క్ట్‌కు పెద్ద ఎత్తున ప్రాధాన్యం ద‌క్కింది.

తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ట్రస్టు బోర్డ్ ఛైర్మన్‌గా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాబాయి వైవీ సుబ్బారెడ్డికి అవ‌కాశం ద‌క్కిన సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో బాబాయికి ఎంపీ టికెట్ ఇవ్వ‌ని జ‌గ‌న్ అధికారంలో వ‌చ్చిన త‌ర్వాత ఈ ప‌ద‌వి కట్ట‌బెట్టారు. అయితే సుబ్బారెడ్డిప్ర‌మాణ స్వీకారం సంద‌ర్భంగా ఆస‌క్తిక‌ర సంఘ‌ట‌న జ‌రిగింది. ఆయ‌న‌కు తులాభారం చేసే సంద‌ర్భంగా ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు కుటుంబ కంపెనీ అయిన హెరిటేజ్ ఉత్ప‌త్తుల‌ను ఉప‌యోగించారు. దీంతో ఈ ఫొటో సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున వైర‌ల్ అయింది. స‌హ‌జంగానే నెటిజ‌న్లు త‌మ‌దైన శైలిలో స్పందించారు.

`నాయుడుగారి హెరిటేజ్ నెయ్యితో...టీటీడీ కొత్త చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి గారికి తులాభారం` అని ఓ నెటిజ‌న్ ట్వీట్ చేశారు. పొద్దున లేస్తే హెరిటేజ్ ను తిట్టినా... అవసరం వచ్చే సరికి హెరిటేజ్ ను వాడతారా బాబాయ్?  అంటున్నారు జనం. కాగా, వైఎస్ జ‌గ‌న్ కుటుంబ స‌భ్యులు, చంద్ర‌బాబు కుటుంబ స‌భ్య‌లు వ్యాపారానికి సంబంధించి ఈ చిత్ర‌మైన వ్యాపార‌బంధం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. 

Sr leader took charges as Chairman. What I liked is his traditional attire with gundu n the thing attracted me is Tulabharam with Heritage Ghee carton boxes. Best Wishes