తెలంగాణలో ఈరోజో గుడ్ న్యూస్ ఉంది

June 02, 2020

తెలంగాణలో కరోనా తీవ్రత బాగా తగ్గుతోంది. ఈరోజు అతిపెద్ద శుభవార్త ఏంటంటే నాలుగో రోజు కూడా తక్కువ కేసులు నమోదు కావడమే కాకుండా హైదరాబాదులో తప్ప ఇంకెక్కడా కొత్త కేసులు నమోదు కాలేదు. గత 24 గంటల్లో తెలంగాణలో కేవలం ఒక్క హైదరాబాదులో మాత్రమే 11 కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్ జిల్లా మినహా మిగతా 32 తెలంగాణ జిల్లాల్లో కొత్త కేసులు జీరో  కావడం పట్ల ప్రభుత్వం సంతోషం వ్యక్తంచేసింది. రెండు రోజులుగా ఒక్క మరణం కూడా సంభవించకపోవడం మరో శుభశూచకం.

ఇక ప్రస్తుతం 1001 కేసులు మొత్తం ఇంతవరకు నమోదు కాగా ఈరోజు 9 మంది డిశ్చార్జి అయ్యారు. 25 మరణాలు, కోలుకున్న వారు 316 మందిని తీసేస్తే ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారి సంఖ్య 660గా ఉంది. వీరిలో 70 శాతం మంది మే 1-2 తేదీల మధ్య కోలుకునే అవకాశం ఉంది. మే 15 నాటికి తెలంగాణలో పూర్తిగా కరోనా రహితంగా మారే అవకాశాలు కన్పిస్తున్నాయి. వాస్తవానికి ఏప్రిల్ 7కి ఇది సాధిస్తాం అని భావించినా.. అనూహ్యంగా బయటపడిన మర్కజ్ వల్ల ఇది సాధ్యంకాలేదు. చివరకు ఒక నెల ఆలస్యంగా కేసీఆర్ కోరిక తీరే అవకాశం కనిపిస్తోంది.

ఇదిలా ఉండగా ఇప్పటివరకు హైదరాబాద్‌ పరిధిలోనే  540 పాజిటివ్‌ కేసులున్నాయి.  అంటే తెలంగాణలోని సగం కేసులిక్కడివే. 

మరోవైపు దేశంలో కేసుల సంఖ్య ఇలా ఉంది.

కొత్త కేసులు : 1975

తాజా మరణాలు : 47 

మొత్తం కేసులు : 26917

మొత్తం మరణాలు : 826 

కోలుకున్న వారు : 5913

యాక్టివ్ కేసులు: 20177