కరోనా మొదటి రోగి పరిస్థితి ఏంటో తెలుసా?

August 09, 2020

ప్రపంచంలో సుమారు 30 వేల మంది కరోనా బారిన పడి ఇప్పటికే మరణించారు. కానీ ఈ వ్యాధి సోకిన మొదటి వ్యక్తి... ఒక మహిళ. ఆమెకు వ్యాధి నయం అయ్యింది. విచిత్రం ఏంటంటే... ఆమెకు వ్యాధి వచ్చిన తర్వాత జరిగిన పరిణామాలు ఆసక్తికరంగా ఉన్నాయి.

ఈ వ్యాధిసోకిన ఆ మొదటి వ్యక్తి మహిళ. ఆమె పేరు వుయ్ జుషాన్. ఆమెకు ఈ వ్యాధి సోకాక ఆస్పత్రికి వెళితే సాధారణ జ్వరం అనుకుని చికిత్స చేసి మందులిచ్చి పంపారు. మందులు వేసుకున్న తీవ్రమయ్యేసరికి ఇంకో ఆస్పత్రికి తరలించారు. అక్కడ కూడా నయం కాకపోవడంతో పెద్ద ఆసుపత్రికి రెఫర్ చేస్తే... ఆమె లక్షణాలు చాలా డిఫరెంట్ గా ఉండటంతో ప్రత్యేకంగా పరిశీలించిన వైద్యులు ఆమె బ్లడ్ శాంపిల్ష్ తీసుకుని పరీక్షించారు. అపుడు ఈ కరోనా బయటపడింది. అయితే... ఆమె పనిచేసే రొయ్యల మార్కెట్ నుంచే చాలా మంది రావడంతో అనుమానం వచ్చి జరిపిన పరీక్షల్లో దీనిని కరోనా అని కనుక్కున్నారు. అది కరోనా అని గుర్తించేలోపు విపరీతంగా పాకిపోయింది. వుహాన్ తో ఇటలీకి నేరుగా సంబంధాలు ఉండటంతో దానిని గుర్తించి చర్యలు తీసుకునే లోపు ఇటలీకి పాకింది. కానీ వారు ఆ ప్రమాదాన్ని ఆలస్యంగా గుర్తించారు. చివరకు ఎంతో మంది ప్రాణాలు కోల్పోయినా మొదటి రోగి మాత్రం కోలుకుని ఆరోగ్యవంతంగా ఉన్నారు.

అయితే, ఈ వ్యాధి చేసిన నష్టం కంటే కూడా ఇది ఆర్థిక వ్యవస్థపై చూపిన ప్రభావం ఎక్కువ. దాని వల్ల కలిగిన ఇబ్బంది ఎక్కువ. ఇప్పటివరకు 30 వేల మంది మరణించారు. ఒక రెండు లేదా మూడు లక్షల మరణాలతో ఇది ఆగిపోవచ్చు. కానీ ఇది సృష్టించిన విలయం మాత్రం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ చేత అమాంతం శవాసనం వేయించింది. అగ్రదేశాలుగా పేరొందిన ఎన్నో దేశాలు అతలాకుతలం అయ్యాయి.