541 ఉద్యోగాలు పీకేసిన జొమాటో

August 08, 2020

వరుస వివాదాలతో సతమతం అయిన జొమాటో ... ఈ వివాదాల వల్ల చాలా కస్టమర్ బేస్ ను పోగొట్టుకుంది. లక్షల కస్టమర్లు దూరమయ్యారు. లక్షకు పైగా యాప్ నే తొలగించినట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తనను తాను సరిచేసుకునేందుకు అనేక పాట్లు పడుతున్న జొమాటో... 541 మంది రోడ్డున పడేసింది. అయితే, ఎక్కడ విమర్శలు వస్తాయేమోనని కొన్ని ఉపశమన చర్యలు మాత్రం ప్రకటించింది.

మొత్తం జొమాటో అడ్మిన్ ఉద్యోగులు డెలివరీ బాయ్స్ కాకుండా 5500 మంది ఉండగా... వారిలో 541 మంది జొమాటో తొలగించింది. వీరందరికి ఇంకో ఉద్యోగం వెతుక్కోవడానికి అవసరమైన సమయం ఇవ్వాల్సిన నేపథ్యంలో... నోటీసు పీరియడు కాకుండా రెండు నెలల అడ్వాన్స్ శాలరీని ఇచ్చి తొలగించింది. వారికి వచ్చే ఏడాది జనవరి వరకు ఉచిత ఇన్సూరెన్స్ కూడా కల్పించింది. దీంతో మరో వివాదం రాకుండా జాగ్రత్త పడింది. 

ఇదిలా ఉండగా... హాస్పిటాలిటీలో చాలా కాలం నుంచి ఉన్న జొమాటో డెలివరీ సేవలు ప్రారంభించి ఇంకా రెండు సంవత్సరాలు కూడా కాలేదు. స్విగ్గీ ఇండియా నెం.1 గా ఉండగా... ఆలస్యంగా ఎంటరయిన జొమాటో భారీ ఆఫర్లతో పెద్ద ఎత్తున కస్టమర్లకు రీచ్ అయ్యింది. ఈ రెండూ ఇపుడు పోటాపోటీగా నడుస్తున్నాయి. డెలివరీ రంగం పుంజుకున్నాక ఫుడ్ క్వాలిటీ బాగా పడిపోయిందని వినియోగదారులు వాపోతున్నారు. వీరి కమిషన్లు భరించలేక రెస్టారెంట్ల ఓనర్లు ధరలు బాగా పెంచేశారని సమాచారం. జొమాటోలో ఆఫర్ తర్వాత వచ్చే రేటు, నేరుగా రెస్టారెంటు టేక్ అవే రేటు రెండూ దాదాపు సమానంగా ఉన్నాయన్న విషయం తెలుసుకుని కస్టమర్లు సోషల్ మీడియాలో ప్రస్తావిస్తున్నారు.