లౌకికవాద మంటూ, సనాతన పై దాడులు ?

September 25, 2020

అబద్దాలకోరుకి ఆగమ శాస్త్ర సలహాదారుని పదావా?
తన రాజకీయ తిరుమల పదవి కోసం పింక్ డైమండ్ పోయిందంటూ అంటూ దేవుడి తోనే నాటకాలా!
సనాతన ధర్మాన్ని కాపాడాలని ముందడుగు వేసిన అధికారికి బదిలీ వేటా!
లౌకికవాదం అంటూ కొందరు నాయకులు సనాతన ధర్మం పై పోరాటం సాగిస్తున్నారు. అందులో రమణదీక్షితులు లాంటివారు కూడా పలుపంచుకోవటం బాధాకరం.
వెంకటేశ్వర స్వామి తోనే నాటకాలు ఆడుతున్నారా! .ముఖ్యంగా నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అభాండాలు మోపి కక్షపూరితంగా ముఖ్యమంత్రి ఇంట్లో పింక్ డైమెండ్ ఉందని అబద్ధపు మాటలు పేర్కొన్న రమణ దీక్షలకు ఆగమశాస్త్ర సలహాదారునిగా ఇవ్వడం సమంజసమా ! నాటి రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం, నేటి జగన్ ప్రభుత్వంలో తిరుమల అధికారిగా పనిచేస్తున్న ధర్మారెడ్డి మీడియా డిబేట్ లో మాట్లాడుతూ పింక్కు డైమండ్ లాంటిది తిరుమలలో లేనే లేదని ఆయన ఘంటాపథంగా చెప్పారు . భక్తుల మనోభావాలతో ఆడుకుంటున్న రమణదీక్షితుల లాంటి వారు ఆగమ శాస్త్ర పండితులు గా ఉండడం ఎంతవరకు సమంజసం. దీనిపై పీఠాధిపతులు స్వామీజీలు మాట్లాడకపోవడం శోచనీయమని, ఇప్పటికైనా దైవ భక్తులగా పీఠాధిపతులు, స్వామీజీలు,భక్తులు కలసికట్టుగా పోరాడి ఇలాంటి వారిని తరమ వలసిందే|| నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడువయసు మళ్ళిన వారికి ఇబ్బంది కలగకుండా యువతరానికి చోటి ఇవ్వాలనే ఉద్దేశంతో రిటైర్మెంట్ ను తేస్తే దీనిపై కొన్ని బ్రాహ్మణ సంఘాలు గగ్గోలు పెట్టాయి, కానీ ఇప్పటి పరిస్థితిని గమనించి కూడా నిద్ర పోతున్నట్టు నటిస్తూ ఉండడం ఆశ్చర్యకరమే!
రండి సనాతన ధర్మాన్ని కాపాడ్డానికి మేము మీతో పాటే మేమున్నామంటూ టిడిపి పిలుపునిస్తున్నారు.. సనాతన ధర్మాన్ని కాపాడడానికి ఎల్ వి సుబ్రహ్మణ్యం లాంటి అధికారులు ముందడుగు వేస్తే వారికి బదిలీ వేటు వేశారన్నారు. ఎల్ వి సుబ్రహ్మణ్యం ని బదిలీ చేస్తే అన్యమతస్తులు కేక్ కట్ చేసి పార్టీలు చేసుకోవడం హిందువుల మనోభావాలను దెబ్బతీయడము కాదా! సనాతన ధర్మాన్ని పాడు చేయడానికి ప్రభుత్వంలోని కొందరు ఎమ్మెల్యేలు, క్రైస్తవ మతం పుచ్చుకున్న ముఖ్యమంత్రి, కీలుబొమ్మల లాంటి రమణదీక్షితులు లాంటి వారిని ముందుకు నడుపుతూ నాడు-నేడు దేవాలయాలకు సంబంధించిన ఆస్తులను,డబ్బును దోచేస్తున్నారు. తన పదవి కోసమై టీటీడీ పై కేసులు వేసి, అబద్ధాలు ఆడి, రాజకీయాలు ఆడుతున్న ఈయనకా తిరుమలలో పదవులు, కోర్టు కేసులు విత్ డ్రా చేసుకోకుండానే రమణదీక్షితులకు తిరుమల పదవి ఇవ్వడం సమంజసమా! సనాతన ధర్మాన్ని పాటిస్తున్న వారితో కలిసి కట్టుగా టిడిపి పోరాటానికి సిద్ధపడుతుంది. తస్మాత్ జాగ్రత్త.
సనాతన ధర్మాన్ని కాపాడాలనుకునే బ్రాహ్మణోత్తములారా రండి పరశురాముని వెలే ముందుండి పోరాడుదాం సనాతన ధర్మాన్ని మనం కాపాడుకుందాం