జగన్ గేమ్ - నోరు జారిన ఏపీ మంత్రి 

September 21, 2020

జీఎన్ రావు కమిటీలో ఏముంది.... జగన్ ఏం చెబితే అదే ఉంది అని అందరి నుంచి విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. రాజధాని విషయంలో జగన్ కు నచ్చింది కమిటీలు నివేదికల్లో పెడుతున్నాయి గాని కమిటీ చెప్పే విషయాలను జగన్ ఏమీ వినడం లేదని మరోసారి తేలిపోయింది. ప్రతిపక్షాలు ప్రజలు చేస్తున్నవి ఆరోపణలు కాదని, నిజాలు అని అర్థమైపోయింది. జగన్ అసెంబ్లీలో చెప్పిన విషయం యాజిటీజ్ గా జీఎన్ రావు కమిటీ నివేదకలో ఉంది. ఆల్మోస్ట్ అదే రేపు బీసీజీ నివేదికలోనూ రానుంది. ఈ రెండింటితో పాటు ఇతర అంశాలను అధ్యయనం చేయడం నిసరనల అనంతరం జగన్ ఏర్పాటుచేసిన కమిటీ కూడా దాదాపు అదే చెప్పనుంది. 

ఇంకా హైపవర్ కమిటీ ఏమీ చెప్పలేదు. అపుడే మీరిలా ఎలా అంటున్నారనుకుంటున్నారా... పొరపాటున ఏపీ మంత్రి నోరుజారాడు. హైపవర్ కమిటీ అయినా జగన్ అభిప్రాయానికి అనుగుణంగానే నివేదిక ఇస్తుందనే విషయాన్ని స్పష్టంచేశారు ఆ మంత్రి. ఏపీకి 3 రాజధానులు అంశంపై లోతుగా అధ్యయనం చేసేందుకు ఏపీ సీఎం జగన్ రెడ్డి వేసిన హైపవర్ కమిటీ 20 రోజుల్లో తన నివేదిక ఇవ్వనుంది. కానీ జగన్ కేబినెట్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మూలాన లీకైపోయిది. 

తిరుపతిలో మీడియాతో మాట్లాడిన మంత్రి పెద్దిరెడ్డి ఏపీ రాజధాని విషయంలో జగన్ ఆలోచనలకు అనుగుణంగానే హైపవర్ కమిటీ నివేదిక ఉంటుందని ఆయన తెలిపారు. ఇంతోటిదానికి హైపవర్ కమిటీ అని పెట్టడం ఎందుకు, లోఓల్టేజ్ కమిటీ అని పెట్టుకోమని నెటిజన్లు చతుర్లు వేస్తున్నారు. పైగా మంత్రి పెద్దిరెడ్డి గారు ఏపీ ప్రజలకు ముఖ్యంగా రాయలసీమ ప్రజలకు ఓ ఉచిత సలహా పడేశారు. ఏపీలో మూడు రాజధానాలు ఉండటం వల్ల ఎవరికి ఎలాంటి నష్టం ఉండదని అర్థం చేసుకోవాలట. కర్నూలులో హైకోర్టు రావడాన్ని రాయలసీమ ప్రజలు స్వాగతించాలట. ఇంకేం మంత్రిగారు చెప్పింది ఫాలో అయిపోండి.