తనకు భవిష్యత్తు లేదని చెప్పేసిన వైసీపీ ఎమ్మెల్యే

September 21, 2020

వైసీపీ తన అభిప్రాయాన్నే ప్రజల అభిప్రాయంగా చెబుతోంది. రాష్ట్రమంతటా అమరావతికి మద్దతుగా పోరాటాలు చేస్తున్నాయి. అమరావతి ప్రాంత ప్రజలు అయితే... లాఠీలను, తూటాలను కూడా లెక్కచేయడం లేదు. ప్రజల ప్రాణాలు పోయినా, రక్తమోడినా ఏ వ్యతిరేకత లేదు అంటూ జగన్ మొండిగా ముందుకు వెళ్తున్నారు. ఇక జగన్ తానా అంటే ఆయన ఎమ్మెల్యేలు తందానా అంటున్నారు. 

అయితే... వైసీపీ ఎమ్మెల్యేలు అందరిదీ ఒకెత్తు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిది ఒకెత్తు. జగన్ రాజధాని మార్చడు అని నమ్మి జగనొస్తే వెంటనే రాజధాని కడతారు అని నమ్మి జనం ఓట్లేస్తే... అసలు ఉన్న దానిని కూడా పీకేసి రెండు జిల్లాల్లో లక్షల కుటుంబాలను రోడ్డున పడేశారు వైఎస్ జగన్. అయినా... జనం కోసం నిలబడకుండా ఆళ్ల... భేషరతుగా మద్దతు తెలుపుతున్నాడు. ఇక భవిష్యత్తులో ఎన్నడూ మంగళగిరిలో ఆళ్ల రామకృష్ణారెడ్డి గెలవడు. ఇది అందరికీ తెలుసు. అయితే... తాజాగా ఆళ్లకు కూడా ఇది అర్థమైపోయింది. ఆయన ఈ విషయాన్ని అసెంబ్లీలో ప్రస్తావిస్తూ... జగన్ రాష్ట్రం కోసం ఆలోచిస్తుంటే... నేను నా రాజకీయ భవిష్యత్తు కోసం ఆలోచించడం కరెక్టు కాదని జగన్ గారికి మద్దతు తెలుపుతున్నాను అంటూ ఆళ్ల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. అంటే... తన భవిష్యత్తు ఏంటో ఆళ్లకు అర్థమైపోయింది. అయితే... జగన్ పట్ల ఆళ్ల లాయల్టీని మాత్రం మెచ్చుకోవల్సిందే. 

ఇదిల ా ఉంటే... ఆళ్ల ప్రసంగం అసెంబ్లీలో చాలా కామెడీగా సాగింది. ఏపీలో రైలు కూత వినపడని ఊళ్లు చాలా ఉన్నాయట. బస్సు కూడా రాని ఊళ్లు ఉన్నాయట. మిగతా జిల్లాల్లో కూలీలకు వెళ్తుంటే... గుంటూరు, కృష్ణా వాసులు అమెరికాకు వెళ్లి బాగా బలిశారు. ఇక మాకు చాలు.. మిగతా జిల్లా వాళ్లు కూడా మాలాగా బలవాలి. అమెరికాకు పోవాలి... అందుకే పరిపాలన వికేంద్రీకరణ కావాలి అంటున్నారు ఆళ్ల. రాజధాని పెడితే జీవితాలు మారతాయి అనుకుంటే... రాజధాని నగరాల్లో పేదలే ఉండకూడదు కదా. అయినా రైలు బస్సు లేకపోతే వాటిని అభివృద్ధి పరచాలి గాని రాజధాని తీసుకెళ్లి విశాఖలో, కర్నూల్లో పెడితే... శ్రీకాకుళం, అనంతపురం ఎలా అభివృద్ధి చెందుతాయో ఆ రహస్యం ఏందో ఆళ్లకే తెలియాలి. ఇక అసెంబ్లీలో జగన్ భజన కోసం అపుడే ఏపీ మొత్తం అభివృద్ధి అయిపోయినట్టు మాట్లాడేశారు వైసీపీ ఎమ్మెల్యేలు. జగన్ మెప్పు కోసం రాష్ట్ర భవిష్యత్తును మంట గలపడానికి ఎవ్వరూ వెనుకాడలేదు.