తన సినిమా చూడొద్దని ఆ హీరోయిన్ కోరుకుంటోందా?

September 21, 2020

తెలుగు భాషల్లో అమలా పాల్ చాలా మంది స్టార్ల సరసన నటించింది. కానీ ఆమె కెరీర్ ఎలాంటి సినిమాతో ఆరంభమైందో తెలిస్తే ఆశ్చర్యపోతారు. తమిళంలోో ఆమె ‘సింధు సమవేలి’ అనే బి-గ్రేడ్ మూవీతో కథానాయికగా పరిచయం అయింది. అందులో ఒక కుర్రాడిని పెళ్లి చేసుకుని అతడి తండ్రితో శారీరక సంబంధం పెట్టుకునే అమ్మాయి పాత్రలో అమలా నటించింది. ఈ సినిమా రిలీజయ్యాక తమిళనాట పెద్ద దుమారం రేగి అమలాకు వ్యతిరేకంగా ప్రదర్శనలు జరగడం గమనార్హం. ఐతే ఎంట్రీ కోసం తప్పటడుగు వేసినా.. ఆ తర్వాత అమల ప్రయాణం భిన్నంగా సాగింది. మంచి సినిమాల్లో నటించి నటిగా పేరు తెచ్చుకుని పెద్ద రేంజికి వెళ్లింది. తొలి సినిమాతో వచ్చిన ఇమేజ్‌ను త్వరగానే చెరిపేసుకుంది. తొలి అవకాశం కోసం తప్పనిసరి పరిస్థితుల్లో ఎలా నటించినా.. త్వరగా ఇలాంటి ఇమేజ్‌ను మార్చుకోవడం చాలా అవసరం.

ఐతే పంజాబీ పాయల్ రాజ్ పుత్‌కు ఈ రకమైన ఆలోచన లేకపోయింది. ‘ఆర్ఎక్స్ 100’లో సెన్సేషనల్ క్యారెక్టర్‌తో ఆమె కథానాయికగా పరిచయం అయింది. ఆ సినిమా ఆమెకు బోల్డ్ ఇమేజ్ తెచ్చిపెట్టింది. అలాంటి పాత్రతో కథానాయికగా పరిచయం కావడానికి గట్స్ ఉండాలి. ఐతే ఈ సినిమాతో వచ్చిన గుర్తింపుతో పాయల్‌కు బాగానే అవకాశాలు వచ్చాయి. కానీ వాటిలో ‘వెంకీ మామ’ లాంటి పెద్ద ప్రాజెక్టుంది. అలాగే ‘ఆర్డీఎక్స్ లవ్’ లాంటి థర్డ్ గ్రేడ్ సినిమా కూడా ఉంది. కానీ ఈ రెంటికీ ఆమె ఓకే చెప్పింది. ఓవైపు వెంకటేష్ లాంటి స్టార్ హీరో పక్కన నటిస్తూ.. ‘ఆర్డీఎక్స్ లవ్’ లాంటి సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించిందామె. ఈ సినిమా చూసి పాయల్ ఎలా దీన్ని ఓకే చేసింది.. ఇంత చీప్‌గా తనను చూపిస్తుంటే ఎలా ఒప్పుకుంది అని జనాలు ఆశ్చర్యపోతున్నారు. తను చేసిన పాత్ర ప్రభావం ఆమె మీదా పడి.. తనపై తక్కువ అభిప్రాయం ప్రేక్షకులకు కలిగితే ఆశ్చర్యం లేదు. అంత వల్గర్‌గా ఆమె పాత్రను ప్రొజెక్ట్ చేశారు మేకర్స్. ఇలాంటి పాత్రలో పాయల్‌ను చూశాక.. కాస్త పేరున్న సినిమాల్లో ఆమెను తీసుకోవడానికి దర్శక నిర్మాతలు భయపడినా భయపడొచ్చు. రిలీజ్ తర్వాత ఈ ఫీడ్ బ్యాక్ చూస్తున్న పాయల్.. ఇప్పుడు రిగ్రెట్ అవుతోందని.. ఈ సినిమాను ఎంత తక్కువమంది చూస్తే తన కెరీర్‌కు అంత మంచిదని భావిస్తోందని సన్నిహితులు అంటున్నారు.