జగన్ పై అమరావతి రైతుల దండయాత్ర

September 21, 2020

చంద్రబాబు మీద, ఒక సామాజిక వర్గం మీద కక్షతో వేల మంది రైతుల పొట్టకొట్టే నిర్ణయం తీసుకున్నారు ఏపీ ముఖ్యమంత్రి జగన్. రాజధానిని రికార్డుల్లోంచి మార్చలేము కాబట్టి... పేరుకు రాజధాని ఇక్కడే పెట్టి... వ్యవహారాలన్నీ ఇక్కడ లేకుండా చేయాలనే పన్నాగంతో విశాఖను రాజధానిగా ఎంచుకున్నారు వైఎస్ జగన్. చంద్రబాబుపై ప్రతీకారం తీర్చుకునే క్రమంలో అన్ని వర్గాల ప్రజలు, ముఖ్యంగా రైతులను చావుదెబ్బ తీస్తున్నారు.

జగన్ ప్రకటించిన వెంటనే మూడు రాజధానుల కాన్సెప్ట్ వైరల్ అయ్యింది. ఐదేళ్ల క్రితం తమ భూములు ఇచ్చిన రాజధాని రైతులు జగన్ నిర్ణయంపై మండిపడుతున్నారు. మేము చంద్రబాబును ప్రధానిని నమ్మి భూములు ఇవ్వలేదు. ప్రభుత్వాన్ని నమ్మి భూములు ఇచ్చాం. మీరు మీ ఇష్టానుసారం చేసుకుంటూ పోతే... మా భూములు మాకిచ్చేయండి అంటూ కొందరు రైతులు నిరసనకు దిగగా మిగిలిన వారు రాజధాని మారిస్తే ఒప్పుకోం అంటూ ఆందోళనలు మొదలుపెట్టారు. 

అభివృద్ధి చెందిన దేశాలను ఆదర్శంగా తీసుకోకుండా వెనుకబడిన దేశాలను ఆదర్శంగా తీసుకోవడం మూర్ఖత్వం అని రైతులు ముఖ్యమంత్రిని విమర్శిస్తున్నారు. అన్ని అభివృద్ధి చెందిన దేశాలకు ఒకటే రాజధాని ఉందన్న విషయాన్ని గుర్తించాలని హెచ్చరించారు. ప్రజలు, అధికారుల ఒక పని కావాలంటే మూడు ప్రాంతాలకు తిరగాల్సిన దుస్థితి వస్తుందని... ఇది మంచి నిర్ణయం కాదని చెబుతున్నారు. ముఖ్యమంత్రి మూడు రాజధానుల ప్రతిపాదన విరమించుకుని... అమరావతిని రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడి నుంచి రాజధానిని తరలిస్తే ఊరుకోబోం అని హెచ్చరించారు.