అమరావతికి సైలెంటుగా మరో షాకిచ్చిన జగన్ !!

September 21, 2020

అంతా అయిపోయింది. 33 వేల ఎకరాల సంపూర్ణ అమరావతి ఇక కల. ప్రైవేటు వ్యక్తుల భూములతో పాటు అక్కడక్కడ ఉన్న అసైన్డ్ భూములు కూడా ఈ పూలింగ్ లో ప్రభుత్వానికి అందిన విషయం తెలిసిందే కదా. జగన్... తాజాగా అమరావతికి మరో గట్టి షాక్ ఇచ్చారు. అసైన్డ్ భూములను అసలు యజమానులకు తిరిగి ఇచ్చేయమంటూ... ప్రభుత్వం చేసిన భూమి పూలింగ్ నుంచి వాటిని తప్పించారు. అదేసమయంలో ప్రభుత్వానికి భూములు ఇవ్వడం ద్వారా కేటాయించిన ప్లాట్లను కూడా ప్రభుత్వం రద్దు చేసింది. అంటే... ఇప్పటికపుడు చంద్రబాబు ముఖ్యమంత్రి అయిపోయినా... అమరావతి నగరం మధ్యమధ్యలో ప్రైవేటు వ్యక్తుల భూములు ఉంటాయి. ఇక ఆ ప్రాంతాన్ని వారి ప్రమేయం లేకుండా అభివృద్ధి చేయలేరు.

సింపుల్ గా చెప్పాలంటే... రేపు పొద్దున మళ్లీ టీడీపీ గెలిచినా అమరావతి కల సాకారం కాకుండా చేయాల్సిన రచ్చ అంతా చేయడానికి జగన్ సిద్ధం అయ్యారు. ఇప్పటికే కొన్ని చర్యలు తీసుకున్నారు. అందులో తాజా చర్య చాలా కీలకమైనది. ప్రజలకు, ప్రభుత్వానికి గొడవలు పెట్టే కీలక నిర్ణయం ఇది. జగన్ నిర్ణయం కొందరు వ్యక్తులకు మోదం కలిగించినా రాష్ట్రానికి మాత్రం దు:ఖాన్ని మిగులుస్తుంది. అందరూ ఏపీ మూడు రాజధానులు ఎలా పెడతారు అన్న గొడవలో పడి కొట్టుకుంటూ ఉంటే... జగన్ సైలెంటుగా ఈ జీవో విడుదల చేశారు. 

ఈ జీవో ప్రకారం... వేర్వేరు వ్యక్తుల నుంచి మరొకరికి అమ్ముడై... వారి నుంచి ప్రభుత్వానికి వచ్చిన భూములు నేరుగా తిరిగి ఒరిజినల్ యజమానులకు కేటాయించాలని ఈ జీవో చెబుతుంది. అంటే అసైన్డ్ భూములు కొన్న వారు కూడా ఈ నిర్ణయంతో నష్టపోయే ప్రమాదం ఉంది. ఎందుకిలా అనే ప్రశ్నకు కూడా ఇదే జీవోలా జగన్ సమాధానం రాయించారు. 1977 అసైన్డ్ భూముల చట్టం... ఈ భూబదలాయింపులకు అడ్డంగా ఉందట. అంటే రాష్ట్రం అభివృద్ధి చెందకపోయినా పర్లేదు గాని రాజధాని రాకపోయినా పర్లేదు గాని... కొందరయినా జై జగన్ అనాలన్నమాట. అదే ఈ జీవో ద్వారా జగన్ కి కలిగే లబ్ధి.