ఆ పెళ్లి మళ్లీ వార్తలకెక్కింది

September 22, 2020

తమిళ కథానాయకుడు.. తెలుగు ప్రజలకు సుపరిచితుడైన పందెంకోడి విశాల్ తెలుగమ్మాయిని పెళ్లి చేసుకుంటున్న విషయం తెలిసిందే. హైదరాబాద్ కు చెందిన అనీశా రెడ్డితో ఆయన వివాహం నిశ్చయమైనట్లుగా వార్తలు వచ్చాయి. అనంతరం.. ఇరువురి మధ్య బ్రేకప్ అయ్యిందని.. పెళ్లి క్యాన్సిల్ అయ్యిందన్న వార్తలు వచ్చాయి. అయితే.. వీటి మీద ఎవరూ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఈ ప్రచారానికి బలం చేకూరుస్తూ.. విశాల్ ఫోటోను అనీశా తన ఇన్ స్టా అకౌంట్ నుంచి తొలగించటంతో సందేహాలు మరింత పెరిగాయి. ఇదిలా ఉంటే.. తన కుమారుడి పెళ్లి గురించి జరుగుతున్న ప్రచారానికి బ్రేకులు వేశారు విశాల్ తండ్రి కమ్ నిర్మాత జీకే రెడ్డి. పెళ్లి క్యాన్సిల్ అయ్యిందన్న వార్తల్లో నిజం లేదన్నారు. ముందుగా అనుకున్న ప్రకారం విశాల్ - అనీశాల పెళ్లి జరుగుతుందని క్లారిటీ ఇచ్చిన ఆయన.. పెళ్లి డేట్ ను ఇంకా ఫిక్స్ చేయలేదన్నారు. నడిగర్ సంఘం భవనాన్ని పూర్తి చేసి.. అందులో పెల్లి చేసుకుంటారన్న ఆసక్తికర మాటను చెప్పారు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకూ విశాల్ పెళ్లి మీద కొంతకాలంగా జరుగుతున్న ప్రచారానికి బ్రేకులు పడినట్లుగా చెప్పక తప్పదు.