బీజేపీకి మరో షాక్ రెడీగా ఉందా?

September 22, 2020

రాష్ట్రాల్లో వరుస దెబ్బలు తింటున్న బీజేపీకి మరో షాక్‌ రెడీగా ఉందన్న అంచనాలు వినిపిస్తున్నాయి. మహారాష్ట్రలో అతిపెద్ద పార్టీగా అవతరించినా ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోవడం.. పశ్చిమబెంగాల్‌ ఉప ఎన్నికల్లో మూడు సీట్లలో ఓటమి పాలవడం వంటివి తెలిసిందే. ఇక త్వరలో జరగనున్న జార్ఖండ్ ఎన్నికల్లోనూ బీజేపీకి షాక్ తప్పదని తెలుస్తోంది. ప్రస్తుతం జార్ఖండ్‌లో అధికారం బీజేపీ చేతుల్లోనే ఉంది. కానీ, ఈ ఎన్నికల తరువాత అక్కడ బీజేపీ అధికారం కోల్పోతుందని పోల్ సర్వేలు చెబుతున్నాయి.
మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో జార్ఖండ్లోనూ బీజేపీకి కఠినమైన పరీక్ష తప్పదని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రధాన విపక్షాలు కాంగ్రెస్, జార్ఖండ్ ముక్తి మోర్చాతో పాటు రాష్ట్రీయ జనతాదళ్ పార్టీ యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటు చేయడంతో బిజెపికి ఇబ్బందులు ఎదురవడం ఖాయమని విశ్లేషిస్తున్నారు. 2005 తర్వాత దాదాపు పదేళ్ళపాటు జార్ఖండ్లో రాజకీయ పరిస్థితులు ఎవరికీ పెద్దగా అనుకూలించలేదు.  దీంతో ఎన్నికల ఫలితాల తర్వాత ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. స్వతంత్ర ఎమ్మెల్యే మధు కూడా ఆధ్వర్యంలో కూడా ఒకసారి కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయింది. 2005, 2009 ఎన్నికల్లో రెండు వేర్వేరు ఫలితాలు వచ్చాయి. 2005లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది 2009లో జేఎంఎం అతిపెద్ద పార్టీగా అవతరించింది. మెజార్టీ తక్కువ సీట్లు దూరంలో నిలిచాయి. అయితే 2014లో ఇందుకు భిన్నమైన ఫలితాలు వచ్చాయి భాగస్వామి ఝార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్‌తో కలిసి బిజెపి కావలసిన మెజారిటీ సాధించింది. 81 స్థానాల్లో 42 సీట్లు గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
2014లో బిజెపి తర్వాత అత్యధిక స్థానాలు దక్కించుకున్న కాంగ్రెస్ ప్రస్తుతం అక్కడ మిగతా పార్టీలతో కూటమి కడుతోంది. నిజానికి 2019లో జరిగిన లోక్‌సభ బిజెపి-ఏజీఎస్‌యూ కూటమి దాదాపు క్లీన్ స్వీప్ చేసింది. 14 లోక్సభ సీట్లలో 13 సీట్లు గెలుచుకున్నాయి. ఈ కూటమికి 50 5.3 శాతం ఓట్లు పడ్డాయి. అయితే... 2014 తర్వాత పలు రాష్ట్రాలలో ఎన్నికలను చూసుకుంటే లోక్ సభ ఎన్నికల తరువాత రాష్ట్రల ఎన్నికల్లో బీజేపీ దెబ్బతింటోంది. జార్ఖండ్లోనూ అదే జరగబోతోందని అంచనా వేస్తున్నారు.
గతంలో జరిగిన లోక్‌సభ ఎన్నికలు ఆ తర్వాత వెంటనే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పరిగణలోకి తీసుకుంటే బిజెపికి ప్రతిసారి లోక్‌సభ ఎన్నికల తర్వాత జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల శాతం తగ్గుతూ వస్తుంది. 2004 జనరల్ ఎలక్షన్స్ తీసుకుంటే బిజెపి 33% ఓట్లు సంపాదించింది. ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 23.6 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. అలాగే 2009 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి 27.5 శాతం ఓట్లు వస్తే ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి 20.2 ఓట్లు మాత్రమే వచ్చాయి. 2014 జనరల్ ఎలక్షన్స్ తర్వాత కూడా ఇదే పరిస్థితి కనిపించింది. 2014 జనరల్ ఎలక్షన్స్ లో బిజెపికి ఏకంగా 40.1 శాతం ఓట్లు వచ్చాయి ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 10 శాతం ఓట్లు తగ్గిపోయి. అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపికి 31.3 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి ఇక మొన్నటి 2019 జనరల్ ఎలక్షన్స్ తీసుకుంటే బిజెపికి భారీగా ఓట్లు శాతం వచ్చింది ఆ పార్టీకి 51 శాతం ఓట్లు పోలయ్యాయి ఇక అసెంబ్లీ ఎన్నికల్లో ఏమవుతుందో చూడాల్సి ఉంది. పాత ట్రెండు, మిగతా రాష్ట్రాల్లో పరిస్తితులను చూసుకుంటే జార్ఖండ్‌లోనూ బీజేపీకి కష్టాలు తప్పవని విశ్లేషకులు చెబుతున్నారు.