చరిత్ర మరిచిపోయినట్టు నటిస్తున్న జగన్

September 24, 2020

ఏ విషయం మీదనైనా ఏ రాజకీయ పార్టీ కానీ.. ఏ రాజకీయ పార్టీ అధినేత కానీ ఒకలాంటి స్టాండ్ నే వినిపిస్తుంటారు. అయితే.. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాస్త భిన్నం. ఏపీ ముఖ్యమంత్రిగా వ్యవహరించిన చంద్రబాబు.. సర్కారీ స్కూళ్లలో ఇంగ్లిషు మీడియంలో చదువు చెప్పే దిశగా నిర్ణయం తీసుకున్నంతలో సాక్షి పత్రికలో వ్యతిరేక కథనాలు కుమ్మరించటమే కాదు.. అమ్మభాషకు బాబు చేస్తున్న ద్రోహం అంతా ఇంతా కాదంటూ భారీ లెక్చర్లు దంచటమే కాదు.. అంతకు మించిన ద్రోహం ఇంకేమైనా ఉందా? అంటూ భారీ డైలాగులే చెప్పేశారు. ఇప్పుడేమైందో ఏమో కానీ.. జగన్ మాటలో చాలానే తేడా వచ్చింది. ఏ రాత్రి వేళ.. ఎవరు చేసిన ఉపదేశమో కానీ ఆయన సర్కారీ స్కూళ్ల ప్రక్షాళన దిశగా పావులు కదుపుతున్నారు. రాష్ట్రంలో ఇసుక కొరతతో అల్లాడిపోతుంటే.. ఇంకేముంది మరో పది రోజులంటూ దాటేస్తున్న ఆయన.. ఆ ఇష్యూను పక్కన పెట్టేసి.. సర్కారీ స్కూళ్లను సంస్కరించే కార్యక్రమాన్ని చేపట్టారు. తాము పవర్లో ఉన్నప్పుడు తెగ తిట్టేసి.. ఇప్పుడు తాను అభ్యంతరం వ్యక్తం చేసిన అంశంపైన యూటర్న్ తీసుకున్న జగన్ తీరుపై విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. అప్పుడలా మాట్లాడి.. ఇప్పుడిలా మాట్లాడటంలో మర్మమేంది జగన్? అంటూ ఉలుకు పలుకు లేకపోగా.. మీ పిల్లలు ఏ మీడియం? మీ మనమళ్లు ఏ స్కూళ్లలో చదివారంటూ ఎదురుదాడి షురూ చేశారు. ఇన్ని విషయాలు చెప్పిన జగన్.. తన పిల్లల్ని ఎంత పెద్ద స్కూళ్లలో చదివించిన విషయాన్ని చెప్పేసి ఉంటే బాగుండేది. మరి.. తన పిల్లల్ని అంత పెద్ద స్కూళ్లలో చదివించిన పెద్ద మనిషి.. చంద్రబాబు హయాంలో ఇంగ్లిషు మీడియంలో స్కూళ్లను మారుస్తానన్నప్పుడు ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేసిందన్న విషయానికి కాస్తంత వివరణ ఇస్తే బాగుంటుంది కదా? ప్రపంచంతో పోటీ పడేలా పిల్లల్ని మార్చాలని.. పెద్ద స్థాయిలో ఉన్నవాళ్లు ప్రభుత్వ పాఠశాలల్లో చదివిస్తున్నారుగా? మన పిల్లలకు ఇంగ్లిషు మీడియంలో లేకపోతే పరిస్థితేమిటంటూ ఆవేధన వ్యక్తం చేస్తున్న జగన్.. గతంలో అందుకు భిన్నమైన మాటల్ని ఎందుకు మాట్లాడారో క్లారిటీ ఇస్తే బాగుంటుందేమో? ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఇసుక కొరత మీద రాష్ట్రం మొత్తం ఆగమాగం అయిపోతుంటే.. దాని గురించి పట్టించుకోకుండా.. సర్కారీ స్కూళ్లను సంస్కరించే ప్రోగ్రాం మీద ఫోకస్ పెట్టటం వెనుక మర్మమేంది జగనా?