అరె జగన్ గా... బాడకవ్ అనేశాడు

September 24, 2020

కొంపదీసి ఈ మాటలు జేసీ దివాకర్ రెడ్డి ముఖ్యమంత్రి జగన్ ని అన్నాడు అనుకునేరు. మన దూల చక్రమవర్తి రాంగోపాల్ వర్మ పూరీ జగన్ గురించి చేసిన వ్యాఖ్యలు.

వీడి నోటి దూల తగలెయ్య, పబ్లిసిటీ కోసం ఎంతమాటైనా అనేస్తాడు. సినిమా విడుదల రోజు పూరీ ఇచ్చి ఇంపోర్టెడ్ పార్టీ లో బాగా కిక్కెక్కినట్టుంది వర్మకు. అందుకే శ్రీరాములు థియేటర్లో ఇస్మార్ట్ శంకర్ సినిమా చూసిన వర్మ మీడియాతో మాట్లాడుతూ... అరే జగన్ గా ... ఇంత మంచి సినిమాలు తీయగలిగిన సత్తా ఉండి ఎందుకు తీయట్లేదురా బాడ్కవ్ ? అనేశాడు. అంతేకాదు, వాడిని కొట్టి వచ్చాక మీతో మాట్లాడుతా అన్నాడు. అనంతరం ట్విట్టరులో కూడా సేమ్ కామెంట్స్ చేశాడు వర్మ. 

జనం వర్మ కాదు వీడు... తెలుగు సినిమా కర్మ అని తిడుతున్నారు.