కన్నుమూసిన అరుణ్ జైట్లీ

September 23, 2020

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సీనియర్ బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ తుదిశ్వాస విడిచారు. జైట్లీ మరణాన్ని ఎయిమ్స్ మీడియా, ప్రొటోకాల్ విభాగం అధికారికంగా ఖరారుచేశాయి. క్యాన్సర్, మూత్రపిండాల రుగ్మతలతో బాధపడుతూ ఆయన చికిత్స తీసుకుంటున్నారు. పరిస్థితి విషయమించడంతో ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆయన మరణ వార్తతో బీజేపీ వారిని శోకంలో ముంచింది. అన్ని పార్టీల ప్రముఖులు ఆయన మృతికి సంతాపం వ్యక్తంచేశారు. అరుణ్ జైట్లీ మధ్యాహ్నం 12.07 గంటలకు తుదిశ్వాస విడిచారు.

1952 డిసెంబరు 28న మహారాజ్‌ కిషన్‌ జైట్లీ, రత్నప్రభ దంపతులకు అరుణ్‌ జైట్లీ జన్మించారు. తండ్రి న్యాయవాది కావడంతో బాగా చదివించారు. 1960 నుంచి 1969 మధ్య కాలంలో పాఠశాల చదువంతా దిల్లీలోని సెయింట్‌ జేవియర్స్‌ స్కూల్‌లో జరిగింది. 1973లో కామర్స్‌లో డిగ్రీ పూర్తి చేశారు. 1977లో దిల్లీ విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు జైట్లీ. తొలుత ఏబీవీపీ సభ్యుడిగా బీజేపీతో అనుబంధం ప్రారంభం అయ్యింది. 1982 మే 24న అరుణ్‌ జైట్లీకి సంగీత డోగ్రీతో వివాహం జరిగింది. ఢిల్లీ హైకోర్టులో సీనియర్‌ అడ్వకేట్‌ హోదాలో పనిచేశారు. 1991 నుంచి జైట్లీ భాజపా జాతీయ కార్యవర్గ సభ్యుడు. 1999 అక్టోబరు 13న తొలిసారి వాజ్‌పేయీ ప్రభుత్వంలో సమాచార ప్రసారశాఖ సహాయ మంత్రిగా పని చేశారు. 2014లో మోడీ సర్కారులో కీలక భూమిక పోషించారు జైట్లీ.

నెలరోజుల్లో ఇద్దరు సీనియర్ బీజేపీ నేతలు మరణించడంపై పార్టీ శ్రేణులు తీవ్ర శోకంతో ఉన్నాయి.