చంద్రబాబులో జోష్... కొత్త షేడ్స్, కొత్త డైలాగ్స్ !!

September 25, 2020

కృష్ణా జిల్లా టీడీపీ నేతల సమావేశం ఉత్సాహంగా జరిగింది. పార్టీ పట్టు జిల్లాలో ఏం కోల్పోలేదని... కార్యక్రమానికి వచ్చిన స్పందన బట్టి అర్థమైంది. అయితే... గతానికి భిన్నంగా ఈరోజు చంద్రబాబు పార్టీ నేతలకు, శ్రేణులు దిశానిర్దేశం చేయడంతో పాటు తన అంతర్మథనాన్ని తనను ఇప్పటికీ విస్మయానికి గురిచేస్తున్న అంశాలను ఈ సందర్భంగా వ్యక్తంచేశారు. వైకాపా ప్రభుత్వం ఏం తప్పు చేసిందో చాలా సూటిగా చెప్పారు. ఘాటు వ్యాఖ్యలతో విమర్శలు చేశారు. గతంలో ఎలా దాడిచేసిందో వెల్లడించారు. మొత్తం మీద చంద్రబాబు ఈరోజు మాట్లాడిన మాటల్లో చాలా డెప్త్ ఉంది. వాటిలో కొన్ని గాఢమైన కీలక వ్యాఖ్యలివి.

  • నా  పార్టీ కుటుంబాన్ని, వ్యక్తిగత కుటుంబాన్ని  వదిలేసి నేను రాష్ట్రం కోసం పనిచేశాను. కానీ నాకు చివరకు మిగిలింది. పార్టీ, ఫ్యామిలీ ... ఈ రెండే. 
  • నేను ఇసుక ఫ్రీ  గా ఇస్తే... ఇసుక మాఫియా అన్నారు. ఇపుడు ఏమైందో చూశారా?
  • సిమెంటు కంటే ఇసుక రేటు ఎక్కువ ఉంది... వైకాపా సర్కారు అసమర్థతకు ఇంతకు మించి ఏం కావాలి?
  • ఇసుక కొరత ఐదు ప్రాణాలు తీసింది... ఇసుక కొరత సృష్టించిన జగన్ ఆ మరణాలకు కారణం కాదా?
  • దోమలపై పోరాటాన్ని అసెంబ్లీలో వెటకారం చేశారు... కానీ రాష్ట్రంలో అవే దోమలు మనుషులను డెంగీతో చంపుతున్నాయి.
  • తెలుగుదేశం ప్రభుత్వం కట్టించిన బిల్డింగులకు వైకాపా రంగులు వేస్తున్నారు... రంగులు మీ మొహాలకు వేసుకోండి బాగుంటాయి.
  • జగన్ అవినీతి తవ్వుతానన్నాడు... ఎంత తవ్వాడు, ఏం తీశాడు?
  • పుష్కరాలు మృతులు నేను చేసిన హత్యలట... మరి బోటులో పోయిన ప్రాణాలు జగన్ చేసిన హత్యలా? 
  • లక్షన్నర రుణ మాఫీని విడతలుగా ఇస్తే... తప్పుడు ఆరోపణలు చేశారు. 12500  రైతు భరోసాను సగానికి తగ్గించి దాన్ని కూడా ఈఎంఐలలో ఇస్తున్నాడు జగన్. 
  • ఎన్టీ రామారావు స్థాపించిన ఈ పార్టీకి సంక్షోభాలు వచ్చాయి... కానీ క్యాడర్ బేస్ ఎన్నడూ కోల్పోలేదు. అతి త్వరలో అధికారంలోకి వస్తాం. ఇది జరుగుతుంది.