చరిత్ర తెలుసుకో జగన్.. నగరాలు వెలిసేదే నదుల పక్కన

September 24, 2020

జగన్ ఎక్కడ చదువుకున్నాడో, ఏం చదువుకున్నాడో ఎవరికీ తెలియదు.  అతనికి తెలియదు. చెబితే తెలుసుకోడు. చరిత్ర చదివితే... మనిషి జీవనం ఎక్కడ ఏర్పడిందోఅర్థమవుతుంది. నాగరికత పుట్టిందే నదుల పక్కన. ఆ విషయం కూడా తెలియని జగన్, ఆయన మంత్రులు ... నదుల పక్కన ఎలా కడతాం. పునాదులుండవు, ఖర్చు ఎక్కువ అంటున్నారు. అమరావతి ఆంధ్రులు రాజధాని. దానిని మారుస్తాం అంటూ ఎవరూ ఊరుకోరు. శాంతియుతంగా నిరసన తెలిపితే అరెస్టు చేస్తున్నారు. ప్రతి ఇంట్లో ఉద్యమం వస్తుంది. దాన్నెలా ఆపగలరు? అందరినీ అరెస్టు చేయడానికి మీ వద్ద ఉన్న జైళ్లు సరిపోతాయా జగన్ అని చంద్రబాబు ప్రశ్నించారు.

వైజాగ్ కంటే అమరావతి మంచి రాజధాని అని శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు అందరి అభిప్రాయం. కానీ స్వార్థం కోసం జగన్ రాజధాని మీద పడ్డాడు. మీ రాజధాని ఏది అంటే... 3 అని చెబితే భవిష్యత్తులో పిల్లలను చూసి నవ్వే పరిస్థితి వస్తుంది. తప్పుడు ప్రచారాలతో అమరావతి వద్దని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. అటు 6 ఇటు 6 జిల్లాలు చూసుకుని మధ్యలో పెట్టిన రాజధాని ఇది. మీకు ఇక్కడ తప్పులు జరిగాయని అనిపిస్తే .. దర్యాప్తు చేసి చర్యలు తీసుకోండి అంటూ చంద్రబాబు అన్నారు. ఒకవైపు నాపై చెప్పులు, రాళ్లు వేస్తే మన డీజీపీ... ఇది ప్రజాస్వామ్యం నిరసన తెలిపే హక్కు ఉందన్నారు. మరి అమరావతి ప్రజలకు నిరసన తెలిపే హక్కు లేదా? వాళ్లనెలా అరెస్టు చేశారు అని బాబు ప్రశ్నించారు. 

ప్రజలు మేల్కోవాలి. మంచి రాజధాని ఉంటేనే యువతకు మంచి ఉపాధి దక్కుతుంది. విభేదాలు సృష్టించి లబ్ధి పొందాలని ప్రయత్నిస్తున్న వైసీపీ ఆటలు సాగనివ్వం అని జగన్ కు చాటిచెప్పాలి. ఆంధ్రుల రాజధాని అమరావతే. మన కర్మ కాబట్టే ఉన్మాది లక్షణాలు కలిగిన ముఖ్యమంత్రి వచ్చాడు అని జగన్ అన్నారు.